ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 18, 2020 , 00:35:49

హరిత తెలంగాణలో భాగస్వాములుకండి

హరిత తెలంగాణలో భాగస్వాములుకండి

సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి.. ఒక ఆకుపచ్చ తెలంగాణ.. జల తెలంగాణను ఈ రాష్ట్ర ప్రజలకు అందించారు. దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రా ష్ట్రంగా తీర్చిదిద్దారు.. తెలంగాణ ఉద్యమ స్ఫూ ర్తితో మొక్కలను సంరక్షించి, హరిత తెలంగాణ ని ర్మాణానికి ముందుకు కదలాలి’..

  • ఉద్యమ స్ఫూర్తితో ముందుకు కదలండి
  • సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఆకుపచ్చ.. జల తెలంగాణ అందించారు
  • ఊరూరా మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు
  • జిల్లాలో లక్షా 10 వేల మొక్కలు నాటి కానుక ఇచ్చారు
  • సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా శార్వరి గ్రీన్‌ పార్కు ప్రారంభించుకున్నాం
  • మీ పిల్లల జన్మదినం రోజు మొక్క నాటించి, సంరక్షించండి
  • రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ‘సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి.. ఒక ఆకుపచ్చ తెలంగాణ.. జల తెలంగాణను ఈ రాష్ట్ర ప్రజలకు అందించారు. దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రా ష్ట్రంగా తీర్చిదిద్దారు.. తెలంగాణ ఉద్యమ స్ఫూ ర్తితో మొక్కలను సంరక్షించి, హరిత తెలంగాణ ని ర్మాణానికి ముందుకు కదలాలి’.. అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పెండ్లిళ్లలో సైతం పెండ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి రిటన్‌ గిఫ్టు రూపంలో ఒక మొక్కను అందించాలన్నారు. అన్ని శుభాకార్యాలకు మొక్కలను ఇచ్చి, హరిత తెలంగాణలో అందరూ భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్‌ జన్మదినం సం దర్భంగా మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని లక్ష మొక్క లు నాటే కార్యక్రమంలో భాగంగా సోమవారం అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ కడవేర్గు రాజనర్సుతో కలిసి సు డా కార్యాలయం ఎదుట మొక్కలు నాటారు. కేకు ను కట్‌ చేసి విద్యార్థులు, వృద్ధులకు తినిపించారు. అనంతరం శార్వరి గ్రీన్‌పార్కును ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. ఒక బొట్టు రక్తం చిందకుండా రాష్ర్టాన్ని సాధించిన ఘనత సీ ఎం కేసీఆర్‌కు దక్కిందన్నారు. ఇవాళ రాష్ట్రంలో 24 గంటల కరెంట్‌, ఇంటింటికీ తాగునీరు, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి 30 లక్షల ఎకరాలకు సా గునీరందించిదన్నారు.

ఇవన్నీ కూడా అతి తక్కువ కాలంలో దేశమే ఆశ్చర్యపడేలా సాధించడంతో యావత్తు తెలంగాణ.. సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నదన్నారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో.. నాటిన మొక్కలను సంరక్షించడం అంతే ముఖ్యమన్నారు. వచ్చేది వేసవి కా లం కాబట్టి ప్రతి మొక్కను సంరక్షించేలా బాధ్యత తీసుకోవాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో మొక్కలు నాటారన్నారు. ప్రజలు చాలా ఉత్సాహంగా, ప్రతి ఒక్కరూ తమ జన్మది నం జరుపుకుంటున్నంతా సంతోషంగా మొక్కలు నాటి, సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా అందరూ కూడా తగిన బాధ్యత తీసుకోవాలని కోరారు. ‘సీఎం కేసీర్‌ జన్మదినాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ మీమీ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటండి.. మీ పిల్లలకు కేకు కట్‌ చేయించడం ఎంత ముఖ్యమో.. మీ పిల్లల జన్మదినం రో జు మొక్క నాటించడం, సంరక్షించడం అంతే ము ఖ్యం’.. అని అన్నారు. సిద్దిపేటలో రెండు స్మృతివనాలు ఏర్పాటు చేసుకున్నామని, ఇష్టమైన వా రు ఎవరైన చనిపోయినప్పుడు వారి పేరిట తప్పకుండా మొక్క నాటాలన్నారు. స్మృతి వనంలో మొక్కలు నాటితే, ఆ మొక్కను సంరక్షించే బాధ్య త మున్సిపాలిటీ వారే తీసుకుంటారన్నారు. సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని సుడా కా ర్యాలయం ముందు శార్వరి గ్రీన్‌ పార్కును ప్రా రంభించుకున్నామని, ఇది ప్రజలందరికీ ఉపయోగపడేలా, వాకర్స్‌, చిన్నపిల్లలు ఆడుకునేలా ఉందన్నారు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా విద్యార్థులు, ప్రజలు, ఉద్యోగులు సీఎం కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా ఎవరేవరైతే మొక్కలు నా టేందుకు వచ్చారో వాంరందరికీ పేరు పేరునా కృ తజ్ఞతలు చెబుతున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జి ల్లా అధ్యక్షుడు వంగ నాగిరెడ్డి, సుడా డైరెక్టర్లు మ చ్చ వేణుగోపాల్‌రెడ్డి, బర్ల మల్లికార్జున్‌, సుడా వైస్‌ చైర్మన్‌ రమణాచారి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


logo