ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 17, 2020 , 00:34:30

మహానేతకు అంకితమిద్దాం

మహానేతకు అంకితమిద్దాం

తెలంగాణ ఉద్యమ నేత.. టీఆర్‌ఎస్‌ అధినేత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 66వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా మొక్క నాటి జననేతకు కానుకిచ్చేందుకు ప్రజానీకం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రతి జీపీ పరిధిలో 200, మండల కేంద్రాల్లో 300, మున్సిపాలిటీ పరిధిలో ఐదు వేలు, సుడా పరిధిలో 5,900 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మహత్తర కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యమ నేత.. టీఆర్‌ఎస్‌ అధినేత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 66వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా మొక్క నాటి జననేతకు కానుకిచ్చేందుకు ప్రజానీకం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ప్రతి జీపీ పరిధిలో 200, మండల కేంద్రాల్లో 300, మున్సిపాలిటీ పరిధిలో ఐదు వేలు, సుడా పరిధిలో 5,900 మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మహత్తర కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.


సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సిద్దిపేట ము ద్దుబిడ్డ.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినం పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా లక్ష మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటేందుకు అన్ని వర్గాల ప్రజలు సిద్ధమయ్యారు. మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో మొక్కలు నాటనున్నారు. సుడా కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శార్వరి గ్రీన్‌ పార్కును మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 200 మొక్కలు, మండలకేంద్రాల్లో 300 మొ క్కలు, ప్రతి మున్సిపాలిటీ పరిధిలో 5 వేల మొక్కలు, సుడా పరిధిలో 5,900మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు హరితహారం లో పాల్గొని జయప్ర దం చేసేందుకు సమాయత్తమయ్యారు. సీఎం కేసీఆర్‌ జన్మదిన వేడుకల సందర్భంగా మొక్కలు నాటడంతో పాటు ఆలయాల్లో ప్ర త్యేక పూజలు చేయనున్నారు. జి ల్లాలో లక్ష మొక్కలు నాటేందుకు  గ్రా మాల్లో కావాల్సిన మొక్కలను పంపిణీ పూర్తి చేశారు. ప్రతి గ్రామ, మండలానికి ప్రత్యేకాధికారులను నియమించి వారి నేతృత్వంలో మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుడా పరిధిలో నాటే మొక్కలను రాజమండ్రి నుంచి తెప్పించారు. 

మున్సిపాలిటీల్లో హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కౌన్సిలర్లు, ప్రత్యేకాధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. కాగా, నియోజకవర్గాల పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలు మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొననున్నారు. ఈ మహాత్తర కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.


* ప్రజలు మెచ్చేలా సంక్షేమ పథకాలు 

సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం పథకాలను ప్రవేశపెట్టి అమలు చేయడంతో ఆ ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందాయి. ఇటీవల జరిగిన వరు స ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వివిధ పథకాలు అమలు చేయడంతో రైతులంతా సీఎం కేసీఆర్‌ వెంటే నిలిచారు. ముఖ్యంగా రైతుబంధు, రైతుబీమా, సకాలంలో ఎ రువులు, విత్తనాలు, ప్రతి పంటను కొనుగో లు చేసి గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించారు. విద్యార్థులకు  స న్న బియ్యం తో భోజనం, అం గన్‌వాడీల బలోపేతంతో పాటు బాలింతలు, చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌తో పేదింటి కల్యాణకాంతులు నింపారు. ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయడంతో పేదల కు మెరుగైన వైద్యం అందుతుంది. ఆసరా లేనివారికి పెన్షన్లు ఇచ్చి పేదింటా పెద్దకొడుకుగా నిలిచారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళ లు, గీత, చేనేత, బీడీ కార్మికులకు పెన్షన్లు రెట్టింపు చేయడంతో వారంతా సం తోషంగా జీవిస్తున్నారు. మత్స్యకారులు, గొల్లకుర్మలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడంతో అన్నివర్గాలకు తగిన న్యాయం కల్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప నులు పూర్తయ్యా యి. త్వరలోనే సిద్దిపేట జిల్లాను గోదావరి జలాలు ముద్దాడనున్నాయి. కాల్వలతో  చెరువులు నింపనున్నారు. కలగా ఉన్న రైల్వే మార్గం త్వరలోనే సాకారం కానుంది. ఇప్పటికే మనోహరబాద్‌ నుంచి గజ్వేల్‌కు ట్రయల్‌ రన్‌ చేశారు. మార్చి చివరి వరకు గజ్వేల్‌ వరకు రైలు రానుంది.  


logo