శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 17, 2020 , 00:33:08

మల్లన్న దర్శనం.. ముక్తిమార్గం

మల్లన్న దర్శనం.. ముక్తిమార్గం

ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. 5వ వారానికి కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, వరంగల్‌ తదితర పూర్వపు జిల్లాల నుంచి సుమారు 50వేల మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి స్వా మిని దర్శించుకున్నారు

  • 5వ వారానికి భారీగా తరలివచ్చిన భక్తులు

 చేర్యాల, నమస్తే తెలంగాణ : ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. 5వ వారానికి కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, వరంగల్‌ తదితర పూర్వపు జిల్లాల నుంచి సుమారు 50వేల మంది భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి స్వా మిని దర్శించుకున్నారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు మల్లన్న స్వామి దర్శనంతో పులకరించిపోయారు. అలాగే, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి నుంచే మొదలైన భక్తుల రాకా ఆదివారం సాయంత్రం వరకు కొనసాగింది. కోనేటిలో పవిత్ర స్నానాలు అచరించి మల్లన్న స్వామిని దర్శించుకొని మొక్కు లు తీర్చుకున్నారు. భక్తులు అర్చనలు నిర్వహించ గా మరికొందరు అభిషేకాలు చేసుకుని తమ మొ క్కులను తీర్చాలని వేడుకున్నారు. కాగా,  ఆలయ డిప్యూటీ కమిషనర్‌  వెంకటేశ్‌, కమిటీ సభ్యులు ముత్యం నర్సింహులు, ఉట్కూరి అమర్‌, బొంగు నాగిరెడ్డి, ఏగుర్ల మల్లయ్య, ఏఈవోలు రావుల సుదర్శన్‌, గంగా శ్రీనివాస్‌, ఆలయ సిబ్బంది విధులు నిర్వర్తించారు. భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌ ఆధ్వర్యంలో అర్చకులు సేవలు అందించారు. హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్‌ ఆధ్వర్యంలో చేర్యాల సీఐ రఘు ఎస్సై నరేందర్‌రెడ్డి భక్తులకు ఇబ్బందులు తలేత్తకుం డా బందోబస్తు చేపట్టారు.


 ‘మల్లన్న’ను దర్శించుకున్న ఫిష్‌ వెంకట్‌

మల్లన్నస్వామి దయతో తాను సినీ రంగంలో రాణిస్తున్నానని ఫిష్‌ వెంకట్‌ అన్నారు. 5వ ఆదివారం సందర్భంగా సినీ నటుడు ఫిష్‌ వెంకట్‌ మల్లన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని ఏండ్లుగా కొమురవెల్లికి వస్తున్నానని తెలిపారు. మల్లన్నను ఏది కోరుకున్నా.. స్వామివారు నాకు ప్రసాదించారని, స్వామి దయతో సినీ రంగంలో రాణిస్తున్నట్లు తెలి 


రేపు మల్లన్న హుండీ లెక్కింపు

 ఈ నెల 18వ తేదీన మల్లికార్జున స్వామి వారి హుండీలను లెక్కింపు చేస్తున్నట్లు ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్‌ తెలిపారు. తన కార్యాలయం లో ఆయన మాట్లాడుతూ.. స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు రూపంలో కానుకలు సమర్పిస్తుండడంతో హుండీలు నిండిపోయినట్లు తెలిపారు. హుండీలతోపాటు బియ్యం హుం డీల విప్పి తూకం వేయనున్నట్లు చెప్పారు. హుం డీ లెక్కింపుకు సంబంధిత అధికారులు, సిబ్బంది సకాలంలో హాజరుకావాలని కోరారు. ఆయనతో ఏఈవో రావుల సుదర్శన్‌, గంగా శ్రీనివాస్‌, పర్యవేక్షకులు నీల శేఖర్‌, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌ తదితరులున్నారు.


logo