గురువారం 04 జూన్ 2020
Siddipet - Feb 14, 2020 , 23:08:41

విజయ పాలసేకరణ ధర పెంపు ఉత్తర్వులు జారీ

విజయ పాలసేకరణ ధర పెంపు ఉత్తర్వులు జారీ

సిద్దిపేట అర్బన్‌ : తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య విజయ డెయిరీ పాల సేకరణ ధరను ఫిబ్రవరి 1 నుంచి పెంచుతున్నట్లు ఉత్తర్వులు వచ్చాయని  విజయ డెయిరీ సిద్దిపేట-కరీంనగర్‌ జిల్లాల డిప్యూటీ డైరెక్టర్‌ ఎన్‌ గోపాల్‌సింగ్‌ తెలిపారు. శుక్రవారం సిద్దిపేట విజయ డెయిరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో 10శాతం వెన్న వచ్చే గేదె పాల ధర రూ.56 ఉండగా, పెరిగిన ధరల ప్రకారం రూ.60 చెల్లిస్తారన్నారు. అలాగే 4.9శాతం వెన్న గల ఆవుపాలకు గతంలో రూ.29 ఉండగా, పెరిగిన ధరల ప్రకారం రూ.32 చెల్లిస్తారని స్పష్టం చేశారు. పై ధరలకు అదనంగా ప్రభుత్వం ఇచ్చే రూ.4 ప్రతి లీటరు ఆవు, గేదె పాలకు  చెల్లిస్తారన్నారు. రైతులు విజయ డెయిరీకే పాలు పోసి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు పొందాలని సూచించారు.


logo