గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 14, 2020 , 23:06:54

ముంపు బాధితులకు అండగా ఉంటాం..

ముంపు బాధితులకు అండగా ఉంటాం..
  • 10 రోజుల్లో రాంపూర్‌, లక్ష్మాపూర్‌వాసులకు ఇండ్ల స్థలాలు
  • సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి
  • తాత్కాలికంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్లలో వసతి

తొగుట: మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు ముంపు బాధితులకు అండగా ఉంటామని సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి భరోసా ఇచ్చారు. మల్లన్నసాగర్‌ కట్ట పనులు పెద్ద ఎత్తున కొనసాగుతుండడంతో కట్టకు మధ్యలో వడ్డెర కాలనీ, రాంపూర్‌, లక్ష్మాపూర్‌ గ్రామాలుండడంతో పనులకు అడ్డంకిగా మారిం ది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు సిద్దిపేట ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్లు బాల్‌రెడ్డి, అన్వర్‌, మల్లన్నసాగర్‌ జేఈ రమేశ్‌రెడ్డి, ఆర్‌ఐ రవీందర్‌, సర్పంచ్‌లు కొల్చెల్మ స్వామి, శ్యామల, వీఆర్వోల ఆధ్వర్యంలో వడ్డెర కాలనీ, రాంపూర్‌, లక్ష్మాపూర్‌ గ్రామస్తులు గజ్వే ల్‌ మండలం ముట్రాజ్‌పల్లిలోని ఇండ్ల స్థలాలు, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భం గా ఆర్డీవో మాట్లాడుతూ మూడు గ్రామాల్లో కలి సి 650మందికి ఆర్‌ఆండ్‌ఆర్‌ పరిహారం ఇచ్చారన్నారు. వీరికి ముట్రాజ్‌పల్లిలో తలా 250 గజా ల ఇంటి స్థలాన్ని వారం రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తామని చెప్పారు. స్థలాల్లో ఇండ్లు నిర్మించుకు నే వరకు తాత్కాలికంగా పక్కనే ఉన్న డబుల్‌ బె డ్‌ రూం ఇండ్లలో వసతి కల్పిస్తామన్నారు. మూ డు గ్రామాల ప్రజలకు ఇండ్ల స్థలాలతో పాటు తాత్కాలిక వసతి కల్పిస్తున్నామని, 20రోజుల్లో గ్రామాలను ఖాళీ చేయిస్తామని చెప్పారు. ముంపు గ్రామాల్లో అర్హులైన వారికి ఏమైనా బిల్లులు పెండింగ్‌లో వెంటకే  మంజూరు చేస్తామన్నారు. మల్లన్న సాగర్‌ ప్రాజెక్టు కోసం అన్ని రకాలుగా సహకారం అందిస్తున్న ముంపు గ్రామాల ప్రజా ప్రతినిధులకు, గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


logo