నో పైరవీలు.. నో లంచం

- నూతన పురపాలక చట్టంతో అందరికీ మేలు
- సులభతరంగా భవనాల అనుమతి
- తప్పు చేసే అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు
- 10 రోజుల్లోగా వార్డు కమిటీలు పూర్తి చేయాలి
- నెలాఖరులోపు అన్ని మున్సిపాలిటీల్లో పబ్లిక్ టాయిలెట్స్
- త్వరగా వైకుంఠధామాలు, డంపుయార్డుల నిర్మాణాలు
- నాటిన మొక్కల్లో 85 శాతం కాపాడకుంటే పదవులు పోతాయ్
- పట్టణ ప్రగతి సమీక్షలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ‘పట్టణాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసి నూతన పురపాలక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రజలందరికీ మేలు చేస్తుంది. ఇందులో కఠిన నిబంధనలు ఉన్నాయి. పనిచేయని అధికారులు,ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకునే అధి కారం చట్టం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న ఇరవైఒక్కరోజుల్లో భవనాల అనుమతి లభి స్తుంది. ఎవరు కూడా పైరవీలు చేయొద్దు. లంచాలివ్వాల్సిన అవసరం లేదు. మున్సిపాలిటీలపై కలెక్టర్లకు విశేష అధికారాలున్నాయి. వార్డుస్థాయిలో నాటిన మొక్కల్లో 85 శాతం కాపాడకుంటే స్థానిక కౌన్సిలర్, సంబంధిత అధికారి,మున్సిపల్ చైర్మన్ బాధ్యులవుతారు.
ప్రతి మూడు నెలలకొకసారి రేటింగ్ ఉంటుంది. మనం దరికీ పరీక్ష సమయం. సమష్టిగా బాధ్యత తీసుకొని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దు కుందాం’ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. పట్టణ ప్రగతిపై గురువారం సిద్దిపేటలో కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితోపాటు ఐదు మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కమిషనర్లు, సుడా పరిధిలోని అధికారులు, కౌన్సిలర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రగతిలో భాగంగా తొలుత 4 అంశాలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 10 రోజుల్లో వార్డుల్లో కమిటీలు వేయడం, డంపింగ్‌యార్డుల నిర్మాణం, ఇంటింటా చెత్త సేకరణ, జనాభా ప్రాతిపదికన పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు, వైకుంఠధామాల నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.
కొత్త మున్సిపల్ చట్టంతో ప్రజల కష్టాలు, ఇక్కట్లు తీరుతాయి.. పైరవీలు ఉం డవు.. లంచం అనేదే ఉండదు.. ప్రభుత్వంలో పారదర్శకత, ప్రజల్లో జవాబుదారితనమే ఈ చట్టం లక్ష్యం. మున్సిపల్ చట్టం లో నిధులు, విధులు, చర్యలు ఉన్నాయి. భవన నిర్మాణ అను మతులు సులభతరం.. తప్పు చేసే అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు ఉంటాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా తొలుత 4 అంశాలను తీసుకుంటామని చెప్పారు. వచ్చే 10 రోజుల్లో వార్డుల్లో కమిటీలు వేయడం, డంపింగ్ యార్డుల నిర్మాణం, ఇంటింటా చెత్త సేకరణ, జనాభ ప్రాతిపదికన పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయడం, వైకుంఠధామాల నిర్మాణాలను చేపపడుతామన్నారు.
సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సుతో కలిసి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కమిషనర్లు, సుడా పరిధిలోని అధికారులు, ముఖ్య అధికారులు, కౌన్సిలర్లతో గురువారం పట్టణ ప్రగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. చట్టం ప్రకారం మనందరిపై బాధ్యత పెరిగిందన్నారు. వార్డు స్థాయిలో నాటిన మొక్కల్లో 85 శాతం కాపాడకపోతే స్థానిక కౌన్సిలర్, సంబంధిత అధికారి, మున్సిపల్ చైర్మన్ బా ధ్యులవుతారని వివరించారు. జిల్లా స్థాయిలో పనులు జరగకపోతే కలెక్టర్, ఉమ్మడి జిల్లా స్థాయిలో తాను బాధ్యులమవుతామన్నారు. ప్రతి మూడు నెలలకొకసారి రేటింగ్ ఉంటుందన్నారు. ఇది అందరికీ పరీక్షా సమయం అన్నారు. అందరం బాధ్యత తీసుకొని రాష్ట్రంలోనే జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుదామని పిలుపుని చ్చారు. మున్సిపాలిటీలపై కలెక్టర్లకు విశే ష అధికారాలను ప్రభుత్వం కల్పించిందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.
10 రోజుల్లోగా వార్డు కమిటీలు పూర్తి చేయాలి
వచ్చే 10 రోజుల్లో అన్ని వార్డుల్లో 4 రకాల కమిటీలను పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. యువ త, మహిళలు, వయోవృద్ధులు, ప్రముఖు లతో కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదే శించారు. ఒక్కో కమిటీలో 15 మంది స భ్యులు ఉండాలని, మొత్తంగా ఒక్కో వార్డు లో 60 మంది సభ్యులు ఉంటారన్నారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో పబ్లిక్ టా యిలెట్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. జనాభా ప్రాతిపదికన రద్ధీ అధికంగా ప్రాంతాల్లో నెలాఖరులోగా పబ్లిక్ టాయిలెట్స్‌ను నిర్మించాలన్నారు. ఉదయం 5:30 నుంచి 9:00 గంటలలోపు ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్త సేకరణ చేపట్టాలని, చెత్త సేకరణకు ట్రాక్టర్లు అవసరముంటే కొనుగోలు చేయాలని సూచించారు. మొదటి ప్రా ధాన్యతగా డంపింగ్ యార్డుల స్థలాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. వారం లోగా వైకుంఠధామాల నిర్మాణాన్ని ప్రారంభించి రెండు నెలల్లోగా పూర్తి చేయాలని కోరారు. సిద్దిపేట, గజ్వేల్ తరహాలో చేర్యాల, దుబ్బాక, హుస్నాబాద్ పట్టణాలను అద్భుతంగా తీర్చిదిద్దాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో వంద శాతం టాక్స్ కలెక్షన్ కూడా చేపట్టాలని సూచించారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం కౌన్సిల్ నుంచి చైర్మన్, అధికారులు, కలెక్టర్, మంత్రులు అందరూ బాధ్యులే అన్నారు. సంఘటితంగా పనిచేసి అన్ని మున్సిపాలిటీలను అద్భుతంగా తీర్చిదిద్ది రాష్ర్టానికే ఆదర్శంగా నిలుపాలని పిలుపునిచ్చారు.
టీమ్ వర్క్‌గా చేద్దాం : కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి
పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ టీమ్‌వర్క్‌గా చేసి రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాను ఆదర్శంగా నిలిపాం. అలాగే, పట్టణ ప్రగతిలోనూ అందరం కలిసికట్టుగా పనిచేసి పట్టణాలను అద్భుత పట్టణాలుగా తీర్చిదిద్దుదాం. హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడమే కాదు.. నాటిన వాటిలో 85 శాతం పైగా మొక్కలను సంరక్షించే బాధ్యతను తీసుకుందామని అధికా రులకు కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి పిలుపునిచ్చారు. మున్సిపల్ బడ్జెట్లో 10 శాతం నిధులు ప్రత్యేకంగా హరితహారానికి కేటాయించడం జరిగిందన్నారు. మున్సిపాలిటీలో ఖాళీల భర్తీ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
సిద్దిపేట, గజ్వేల్ మున్సిపల్లో సరిపోయేంత స్టాఫ్ ఉందని మిగితా మున్సిపాలిటీల్లో తక్కువగా ఉందని అందుకు తగ్గట్టుగా స్టాఫ్‌ను త్వరలోనే నియమించనున్నట్లు వివరించారు. మున్సిపాలిటీలపై కలెక్టర్లకు విశేష అధికారాలు ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. పట్టణ, స్థానిక సంస్థల బడ్జెట్ రూపొందించడం లో ప్రణాళికబద్ధంగా ఉండాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో తప్పనిసరిగా ఖర్చు చేయాల్సినవి జీతభత్యాలు, వీధి దీపాల విద్యుత్ బిల్లులు, మంచి నీటి సరఫరా విద్యుత్ బిల్లులు, అప్పు లు, రుణాలు ఉంటే తిరిగి చెల్లించడం, మొక్కలు నాటడం, నర్సరీల అభివృద్ధి, పారిశుద్ధ్య అవసరాల కోసం 10 శాతం గ్రీన్ బడ్జెట్లో ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతినెలా మ్యాచింగ్ గ్రాంట్ వస్తుందన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలకు కలిపి నెలవారీగా రూ.148 కోట్లను విడుదల చేస్తుందని కలెక్టర్ తెలిపారు.
మున్సిపల్ చట్టంలోని ముఖ్యాంశాలు
- పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతినెలా మ్యాచింగ్ గ్రాంట్ మున్సిపల్‌కు రానుంది.
- ప్రతి మున్సిపాలిటీలో గ్రీన్ యాక్షన్ ప్లాన్ ఏర్పాటు.
- వార్డుల్లో నర్సరీలకు స్థలం కేటాయించడం.
- వార్డుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం.
- మున్సిపాలిటీలో గ్రీన్ సెల్ ఏర్పాటు చేసి, వార్షిక
- బడ్జెట్లో 10 శాతం ప్రత్యేక నిధులు కేటాయించడం.
- 75 చదరపు గజాల విస్తీర్ణంలో నివాస భవన నిర్మాణా లకు ఏలాంటి అనుమతి అవసరం లేదు. కేవలం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి ఒక రూపాయి చెల్లిస్తే సరిపోతుంది.
- బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు, అలాగే, 500 చదరపు మీటర్ల కన్న ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్‌లో నిర్మాణా లకు 21 రోజుల్లోగా ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో బిల్డింగ్ ఆమోద ప్రక్రియను టీఎస్బీపీఎస్ఎస్ అని పిలువబడుతుంది. దీనికి అనుమతులన్నీ ఒకచోటే జారీ చేయబడుతాయి.
- అక్రమ భవన నిర్మాణాల సమాచారాన్ని మున్సిపల్ కమిషనర్, కలెక్టర్‌కు తెలియజేసిన పౌరులకు ప్రోత్సాహమిస్తారు.
- తాత్కాలిక లేఅవుట్ ఏర్పాటు కోసం స్వీయ ధ్రువీకరణపై ఆన్లైన్ ద్వారా 21 రోజుల్లో అనుమతి పొందవచ్చు.
- ప్రతి లేఅవుట్‌లోనూ లే అవుట్ యజమాని, ఉమ్మడి పార్కింగ్ స్థలానికి భూమిలోని కొంత స్థలాన్ని తప్పనిసరిగా ప్రత్యేకంగా కేటాయించాలి.
- లేఅవుట్ పూర్తి చేసిన తరువాత ఖాళీ స్థలాల్లో, రోడ్లకు కేటాయించిన భూమిని పురపాలక సంఘానికి రిజిస్ట్రేషన్ చేయాలి. తర్వాత కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడిన లే అవుట్ ఆమో ద కమిటీ తాత్కాలిక లేఅవుట్లను పరిశీలించి, సరిగ్గా ఉంటే కమిటీ శాశ్వత అనుమతిని ఆన్లైన్ ద్వారా జారీ చేస్తారు.
తాజావార్తలు
- ఆరో తేదీ వరకు జేఈఈ-మెయిన్ రిజిస్ట్రేషన్!
- సింధు,శ్రీకాంత్ శుభారంభం
- గెలుపు ముఖ్యం.. రోజులు కాదు.. క్రిటిక్స్‌పై కోహ్లీ
- అభివృద్ధిలో ఆదర్శం దమ్మాయిగూడెం
- కష్టాలు దూరమై.. ప్రగతికి చేరువై..
- ప్రతిపక్షాలది గోబెల్స్ ప్రచారం
- పల్లా గెలుపు.. చారిత్రక అవసరం
- ఆయన వస్తే మార్పులేం ఉండవు.. వైస్సార్సీపీలోకి గంటా రాకపై విజయ్ సాయి
- కోల్డ్‌స్టోరేజీలకు ఎండుమిర్చి
- కొలువుల జాతర