సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 13, 2020 , 23:23:11

అర్బన్‌ పార్క్‌లో కాటేజీలు

అర్బన్‌ పార్క్‌లో కాటేజీలు

నర్సాపూర్‌, నమస్తే తెలంగాణ : నర్సాపూర్‌ అటవీప్రాంతంలో నిర్మిస్తున్న అర్బన్‌ పార్కు పనులు మూడు నెలల్లో పూర్తవుతాయని, జూన్‌లోగా కాటేజీల నిర్మాణాలను పూర్తి చేస్తామని సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, సీఎం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్‌, ఫారెస్ట్‌ హెచ్‌వోడీ శోభ తెలిపారు.  గురువారం నర్పాపూర్‌ అటవీప్రాంతంలో ఫారెస్ట్‌ శాఖ ఆధ్వర్యంలో అర్బన్‌  పార్కు నిర్మాణ పనులను  ప్రిన్సిపల్‌ ఛీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ దోబ్రీయాల్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ తివారీ, జిల్లా అటవీశాఖ అధికారి పద్మజారాణితోకలిసి వారు పరిశీలించారు. మెడన్‌బండ వద్ద ఉన్న రెండు చెక్‌డ్యాంలను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌ నగరానికి నర్సాపూర్‌ అడవి అతిసమీపంలో ఉండడంతో ప్రభు త్వం అర్బన్‌ పార్కును ఏర్పాటు చేస్తుందని తెలిపారు. నర్సాపూర్‌ నుంచి పిల్లుట్ల వరకు నర్సాపూర్‌ బ్లాక్‌ ఉందని, ఇక్కడి నుంచి అక్కడి వరకు పార్కును ఏర్పాటు చేస్తున్నామని,  అవసరమున్న చోట చెక్‌డ్యాంలను నిర్మిస్తామని వివరించారు.  ఇప్పటి వరకు రూ.9 కోట్లతో పనులు పూ ర్తయ్యాయని పేర్కొన్నారు.


అటవీలోని హైలెవల్‌ ప్రాంతంలో వాచ్‌టవర్‌ నిర్మించామని, ఎవరైనా సరే ఇక్కడి నుంచి ప్రకృతి అందాలను తిలకించవచ్చన్నారు.  ఫారెస్ట్‌లో ప్రజలు ఉండడానికి వీలు లే దని.. ఈ నేపథ్యంలో  నర్సాపూర్‌ రాయారావు చెరువు సమీపంలో 14 ఎకరాల స్థలాన్ని తీసుకొని 10 కాటేజీలను నిర్మిస్తామన్నారు. కాటేజీలో ఎడ్యుకేషన్‌ సెంటర్‌ నిర్మించి, పిల్లలకు ప్రకృతి పరమైన సినిమాలు చూ పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో అరుణారెడ్డి, నర్సాపూర్‌ ఎఫ్‌ఆర్‌వో గణేశ్‌, తహసీల్దార్‌ మాలతి పాల్గొన్నారు. 


logo