మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 13, 2020 , 23:19:17

పోచారం అభయారణ్యం అద్భుతం

పోచారం అభయారణ్యం అద్భుతం

హవేళిఘనపూర్‌ : జిల్లా కేంద్రానికి అతి సమీపం లోని హవేళిఘనపూర్‌ పోచారం వన్యప్రాణి అభయారణ్య అందాలు పర్యాటకులను ఆకట్టుకునేలా ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు అన్నారు. గురువారం మండల పరిధిలోని పోచారం అభయారణ్యాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ, అటవీశాఖ సీసీఎఫ్‌లు అరున్‌ దోబ్రీయాల్‌, శోభ, హరితహారం ఓఎస్డీ ప్రియాంకవర్గీస్‌తో కలిసి ప్రత్యేక వాహనంలో పోచారం అభయారణ్యాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మెదక్‌ అటవీ విస్తీర్ణం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, అందులో భాగంగానే హరితహారం చేపట్టడం జరిగిందన్నారు. ఉన్న అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివాద ప్రాంతంలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే జరిపి పరిష్కరించాలన్నారు. అటవీ సంపదను డివిజన్ల వారీగా మ్యాపులు సిద్ధం చేసి విస్తీర్ణాన్ని గుర్తించాలన్నారు. అనంతరం పోచా రం అభయారణ్యాన్ని అధికారులతో కలిసి ప్రత్యేక వాహనంలో సందర్శించారు. అరణ్యంలోని నీటి తొట్లలో నీటిని నింపేందుకు సోలార్‌ విద్యుత్‌ వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమం లో సీసీఎఫ్‌ శరవణన్‌, మెదక్‌ ఆర్డీవో సాయిరామ్‌, తహసీల్దార్‌ వెంకటేశం, ఇరిగేషన్‌ అధికారి శ్రీహరి ఉన్నారు.


logo