మంగళవారం 02 జూన్ 2020
Siddipet - Feb 11, 2020 , 23:33:13

పీఏసీఎస్‌లో అన్ని స్థానాల్లో విజయం సాధించాలి

పీఏసీఎస్‌లో అన్ని స్థానాల్లో విజయం సాధించాలి

చేర్యాల, నమస్తే తెలంగాణ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు విజయం కోసం ప్రతి కార్యకర్త సైనికుల వలే పని చేయాలని, కష్టపడి పని చేసే నాయకులు, కార్యకర్తలకు త్వరలో తగిన విధంగా గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పట్టణంలోని బద్దిపడిగె కృష్ణారెడ్డి గెస్ట్‌హౌజ్‌లో మంగళవారం టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ గుజ్జ సంపత్‌రెడ్డి అధ్యక్షతన చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాలకు చెందిన ఎంపీపీ, జడ్పీటీసీ, మండల అధ్యక్షులు, సర్పంచ్‌, ఎంపీటీసీ, మాజీ ప్రజాప్రతినిధులు, చేర్యాల మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు, పీఏసీఎస్‌ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని సోసైటీలను కైవసం చేసుకొని సీఎం కేసీఆర్‌కు కానుక ఇవ్వాలని, అందుకు తగిన విధంగా పార్టీ శ్రేణులు ప్రచారం సాగించాలన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను రైతులకు వివరించి వారితో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేయించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని సూచించారు. కరువు తీవ్రతను శాశ్వతంగా తొలగించేందుకు తాను కృషి చేస్తున్నానని, మల్లన్నసాగర్‌ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు జలాలను తీసుకువచ్చి ఈ ప్రాంత చెరువులను నింపి రెండు పంటలకు నీటిని అందించేడమే తన లక్ష్యమన్నారు. 


సర్పంచ్‌, ఎంపీటీసీ, మున్సిపాలిటీలో విజయం సాధించేందుకు కార్యకర్తలు పట్టుదలతో కృషి చేశారని, అదే పద్దతి సహకార ఎన్నికలలో కష్టపడి అన్ని డైరెక్టర్‌ పదవులను గెల్చుకోవాలన్నారు. సాగు నీరు అందించిన అనంతరం సంక్షేమ పథకాలు తమకు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతూ మండల సభలు, గ్రామ పంచాయతీలు చేసిన తీర్మాణాలను సోసైటీ ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్‌కు అందిస్తానని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులు, కార్యకర్తలకు నామినేటేడ్‌, పార్టీ పదవులలో ప్రాధాన్యత ఉంటుందని, అలాగే ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించే కార్యక్రమం కార్యకర్తల ద్వారా కొనసాగిస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీలు కల్ల్లబొల్లి కబుర్లు చెప్పి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఘనత సీఎం కేసీఆర్‌ది మాత్రమేననే విషయాన్ని ప్రతి రైతుకు తెలియజేయాలన్నారు. ఎన్నికలలో పోటీ చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు జంకుతున్నాయని, ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌ పార్టీదే విజయమన్నారు. కార్యకర్తల కృషితో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయాలను సొంతం చేసుకుంటున్నదని, కార్యకర్తల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు బద్దిపడిగె కృష్ణారెడ్డి, వుల్లంపల్లి కరుణాకర్‌, జడ్పీటీసీలు శెట్టె మల్లేశం, సిలువేరు సిద్దప్ప, మూడు మండలాల అధ్యక్షులు అనంతుల మల్లేశం, గీస భిక్షపతి, మంద యాదగిరి, నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య, అంకుగారి శ్రీధర్‌రెడ్డి, తలారి కిషన్‌, మల్లేశం, సుంకరి మల్లేశం,వైస్‌ ఎంపీపీలు తాండ్ర నవీన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, మెరుగు కృష్ణ, ఆర్షద్‌, డైరెక్టర్‌ ఉట్కూరి అమర్‌, బొంగు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo