సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 11, 2020 , 23:29:38

సరిలేరు.. టీఆర్‌ఎస్‌కెవ్వరు!

సరిలేరు.. టీఆర్‌ఎస్‌కెవ్వరు!

ములుగు: ప్రజల పార్టీగా గుర్తింపు తెచ్చుకొని దూసుకుపోతున్న టీఆర్‌ఎస్‌కు ఎవరూ సరిలేరని మాజీ ఏఎంసీ చైర్మన్‌ జహంగీర్‌, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ బట్టు అంజిరెడ్డి అన్నారు. మంగళవారం ములుగు మండల పరిధిలోని లక్ష్మక్కపల్లిలోని వీపీజే ఫంక్షన్‌హాల్‌లో  ఏకగ్రీవంగా ఎన్నికైన 9మంది సహకార డైరెక్టర్లు, ఆయా గ్రామాల ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేసి కాబోయే పీఏసీఎస్‌ చైర్మన్‌గా బట్టుఅంజిరెడ్డి, వైస్‌ చైర్మన్‌గా కుక్కల నరేశ్‌గౌడ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన డైరెక్టర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం జహంగీర్‌, అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అందిస్తున్న టీఆర్‌ఎస్‌, సీఎం కేసీఆర్‌ ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీపై నమ్మకం పెట్టి ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఘనవిజయం అందిస్తున్న ప్రజలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పెద్దబాల్‌ లావణ్య అంజన్‌గౌడ్‌, జడ్పీకో-ఆప్షన్‌ సభ్యుడు సలీం, వైస్‌ ఎంపీపీ వీరన్నగారి దేవేందర్‌రెడ్డి, సర్పంచులు ఫోరం మండల అధ్యక్షుడు గణేశ్‌గుప్తా, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు లింగారెడ్డి, వీపీజే ఫౌండేషన్‌ చైర్మన్‌ విష్ణుజగతి, కేబీఆర్‌ ఫౌం డేషన్‌ చైర్మన్‌ బాల్‌రెడ్డి, ఎంపీటీసీలు హరిబాబు, ప్రవీణ్‌, మధుసూదన్‌రెడ్డి, నాయకులు బాపురెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, బాబుగౌడ్‌, నగేశ్‌, ఆ యా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 


logo