గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 10, 2020 , 23:44:09

ట్రాక్టర్ల పంపిణీ రెండు రోజుల్లో పూర్తి చేయాలి

ట్రాక్టర్ల పంపిణీ రెండు రోజుల్లో పూర్తి చేయాలి
  • ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌, ట్రాలీ ఉండాల్సిందే..
  • ప్రగతి పనులు నిరంతరం కొనసాగాలి
  • అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : రెండు రోజుల్లో జిల్లాలోని అన్ని గ్రామాలకు ట్రాక్టర్ల పంపిణీ పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సోమవారం అ ధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం 30 రోజుల కార్యాచరణ పనులపై అధికారులు, ఎంపీడీవో, ఎంపీవో సర్పంచులు, ట్రాక్టర్‌ డీలర్లు, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడారు. గ్రామాల్లో చెత్త డంపింగ్‌ యార్డులకు తరలించడానికి, హరితహారంలో నా టిన మొక్కలకు నీరు అందించడానికి ట్రాక్టర్లు, ట్రాలీలు, వాటర్‌ ట్యాంకులను కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తున్నదన్నారు. అధికారులు, సర్పంచులు, డీలర్లతో చర్చించి, రెం డు రోజుల్లో అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు పంపిణీ చే యాలన్నారు.


30 రోజుల కార్యాచరణలో భాగం గా గ్రామాలన్నీ చాలా పరిశుభ్రంగా మారాయని, అదే స్ఫూర్తితో నిరంతరం కొనసాగించాలన్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు, వైకుంఠధామా ల నిర్మాణాలకు స్థల సేకరణలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, సేకరించిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఈ మేరకు తహసీల్దార్‌, ఎంపీడీవోలు సమన్వయంతో పని చేయాలన్నారు. తిరిగి శుక్రవారం సమీక్ష నిర్వహిస్తానని, అప్పటిలోగా ప్రతి గ్రామంలో ట్రాక్టర్‌, ట్యాంకర్‌, ట్రాలీ, బ్లేడ్‌, డోజర్‌ కొనుగోలు చేయాలని ఇందుకు సంబంధించి పూర్తి నివేదికతో రావాలన్నారు. నిర్లక్ష్యం వహించిన ఎంపీడీవోలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ము జాంబిల్‌ఖాన్‌, డీపీవో సురేశ్‌బాబు, జడ్పీ సీఈవో శ్రావణ్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ లక్ష్మిప్రసాద్‌ తదితరులు ఉన్నారు.


రైల్వేలైన్‌ సర్వే, భూసేకరణ త్వరగా చేపట్టాలి 

రైల్వేలైన్‌ సర్వే, భూసేకరణ త్వరితగతిన చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో జేసీ పద్మాకర్‌, అడిషినల్‌ కలెక్టర్‌ ముజాంబిల్‌ఖా న్‌, ఆర్డీవో అనంతరెడ్డి, దక్షిణ మధ్య రైల్వే సర్వే అధికారి ధర్మారావు, సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, సర్వేయర్లతో కలిసి సిద్దిపేట రూరల్‌, అర్బన్‌, చిన్నకోడూరు మండలాల మీదుగా వెళ్లే ప్రతిపాదిత గ్రామాల వారీగా రైల్వేలైన్‌ పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైల్వేలైన్‌ భూసర్వే, భూసేకరణకు సంబంధించిన అంశాలపై ఆర్డీవో, తహసీల్దార్‌ విజయ్‌సాగర్‌, పరమేశ్వర్‌, సర్వేయర్లు రామ్‌భద్ర, అజీంతో చర్చించారు. పనులన్నీ వేగవంతంగా జరుపాలని సూచించారు.


15 రోజుల్లో పీఎం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు

భారత ప్రభుత్వ ఆదేశానుసారం ప్రధానమంత్రి కిసాన్‌ లబ్ధిదారులకు సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌ల ద్వారా 15 రోజుల వ్యవధిలో వంద శాతం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను అందించనున్నట్లు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో లక్షా 61 వేల 387 మందికి పీఎం కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇస్తామని, లబ్ధిదారులు సంబంధిత బ్రాంచ్‌లను సంప్రదించాలన్నారు. కిసాన్‌ క్రె డిట్‌ ద్వారా రుణ పెంపుదల కోసం బ్రాంచ్‌ మేనేజర్లను కలువాలన్నారు. రూ. లక్షా 60 వేల వరకు అర్హత కలిగిన లబ్ధిదారులు సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌లో భూమి పంట వివరాలు సమర్పించి క్రెడిట్‌ కార్డు పొందవచ్చన్నారు. కిసాన్‌ లబ్ధిదారులకు సామాజిక రక్షణలో భాగంగా ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమాయోజన, ప్రధానమంత్రి సురక్ష పథకాల్లో భాగస్వాములను చేశారన్నారు.


logo