శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 10, 2020 , 23:37:42

వైద్య సేవలు భేష్‌

వైద్య సేవలు భేష్‌

గజ్వేల్‌ రూరల్‌: వైద్య సేవలు అందించడం లో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే నెం.1 అని, గ్రామీణ ప్రాంతవాసులకు అందిస్తున్న వైద్య సేవలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని నీతి ఆ యోగ్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ రాజేశ్‌కుమార్‌ అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నీతి ఆయోగ్‌ బృందం సోమవారం గజ్వేల్‌ జిల్లా దవాఖానను సందర్శించింది. ఇక్కటి పాలియోటివ్‌ కేర్‌ సెంటర్‌లో రోగులకు అందుతున్న వై ద్య సేవలను అడిగి తెలుసుకొని, సంతృప్తి వ్య క్తం చేసింది. అనంతరం బృందం సభ్యుడు రా జేశ్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భా గంగా మొదటి రోజు యాదాద్రి భువనగిరి, రెం డో రోజు సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని పీహెచ్‌సీ కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, దవాఖానల్లో రోగులకు అందిస్తున్న వైద్య సేవలు ఎంతో బాగున్నాయన్నారు. కేం ద్రం ప్రభుత్వం ఆదేశాల మేరకు అధ్యయనం చేసేందుకు ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. గజ్వేల్‌ దవాఖానలో క్యాన్సర్‌ రోగులను బాగా చూసుకుంటున్నారన్నారు. ఇక్కడ మానసిన రోగులు, వయో వృద్ధులకు ఎలాంటి చికిత్సలు అందిస్తున్న తెలుసుకున్నామన్నారు. గ్రామీణ ప్రాం తాల్లో ఇలాంటి దవాఖానాల్లో నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చే స్తున్న కృషిని అభినందించారు. అధ్యయన పూ ర్తి వివరాలను త్వరలోనే తాము కేంద్రానికి అందజేస్తామన్నారు.


రాయపోల్‌ పీహెచ్‌సీలో సమీక్ష

రాయపోల్‌ : రాయపోల్‌ పీహెచ్‌సీలో నీతి ఆయోగ్‌ బృందం సమీక్ష నిర్వహించింది. గ్రా మాల్లో పేదలకు మానసిక వైద్య సేవలు అందిం చే విధానాన్ని అడిగి తెలుసుకున్నది. మానసిక వైద్య పూర్తి వివరాలను బృందం సభ్యులు న మోదు చేసుకున్నారు. అవసరమైన పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీహెచ్‌ఆర్‌ఎస్‌ అస్లూ గ్రోవర్‌, నీతి ఆయోగ్‌ అధికారి రాజేశ్‌కుమార్‌, ఎయిమ్స్‌కు చెందిన రాజేశ్‌సాగర్‌, స భ్యులు మానసిక వైద్యులు సుహాసిని, రాయపోల్‌ పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీధర్‌, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.


రాయవరంలో.. 

జగదేవపూర్‌: రాయవరం గ్రామంలో సోమవారం నీతి ఆయోగ్‌ బృందం పర్యటించింది. ముందుగా గ్రామంలోని ప్రభు త్వ ఆరోగ్య ఉపకేంద్రాన్ని సందర్శించి, గ్రామస్తులకు అందుతు న్న వైద్య సేవలపై గ్రామవృద్ధులను అడిగి తెలుసుకున్నది. అదే విధంగా మిష న్‌ భగీరథ జలా లు, ఆసరా పింఛన్లు, పారిశుధ్య నిర్వహణ, ప్ర భుత్వ సేవల గురించి వివరాలు సేకరించింది. గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించి, మురు గు కాలువలు, శానిటేషన్‌, హరితహారం పను లు పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేసింది. నీతి ఆయోగ్‌ బృందం సభ్యులను స ర్పంచ్‌ పావని ఘనంగా సన్మానించారు.


logo