ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 10, 2020 , 23:37:54

నులి పురుగులను పూర్తిగా నివారిద్దాం

నులి పురుగులను పూర్తిగా నివారిద్దాం

దుబ్బాక టౌన్‌ : చిన్నపిల్లల్లో కనిపించే నులిపురుగులను పూర్తిగా నివారిద్దామని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనిత అన్నారు. జాతీయ ఫైలేరియా, నులిపురుగుల నివారణ దినాన్ని పురస్కరించుకొని సోమవారం దుబ్బాక పట్టణంలోని స్థానిక కస్తూర్బా పాఠశాల, రేపల్లెవాడ ప్రాథమిక పాఠశాల నెంబర్‌-2లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విద్యార్థులకు నులిపురుగు నివారణ మాత్రలను వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..నులిపురుగుల వల్ల విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉంటాయని అందువల్ల విద్యార్థులకు తప్పనిసరిగా నివారణ మందులు, అల్బెండజోల్‌ మాత్రలు వేయించాలన్నారు. వీటితో పాటు బోదకాల నివారణ మాత్రలు సైతం వే యించాలని ఆమె సూచించారు. రేపల్లె పాఠశాల పూర్వ విద్యార్థి అయిన చైర్‌పర్సన్‌ పాఠశాల నూతన భవన నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ బట్టు యాదమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సింహరెడ్డి, ఉపాధ్యాయులు ఉమామహేశ్‌, రమేశ్‌, మల్లయ్య ఉన్నారు.


ఫైలేరియా, నులి పురుగుల నివారణకు  కృషి చేద్దాం

దుబ్బాక,నమస్తే తెలంగాణ : బోద, నులి పురుగుల నివారణ కోసం సమిష్టిగా  కృషి చేద్దామని  ఎంపీపీ కొత్త పుష్పలత, జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి అ న్నారు. సోమవారం మండలంలో  బోదకాల , నులి పురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..2020 ప్రభుత్వం యాక్షన్‌ ప్లాన్‌లో భాగంగా బోదకాల, నులి పురుగుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందుకు ప్రజలను అవగాహన కల్పించడంతో పాటు మాత్రలు పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ నెల 12 వరకు గ్రామాల్లో బోద, ను లి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.  కార్యక్రమంలో  వైస్‌ ఎంపీపీ అస్క రవి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు , వైద్య సిబ్బంది ఉన్నారు.


ఫైలేరియా వ్యాధి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం

మిరుదొడ్డి : ఫైలేరియా వ్యాధి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాడానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తూ, వైద్య రంగానికి పెద్ద పీట వేస్తున్నారని ఎంపీపీ గజ్జెల సాయిలు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య, పార్టీ మండల సీనియర్‌ నేత  సూకురి లింగం అన్నారు. 10వ తేదీన జాతీయ బోదకాల, నులి (నట్ట) పురుగుల నివారణ దినం సందర్భంగా సోమవారం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఎన్‌డీడీ, డీఈసీ మాత్రలను వేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న నాటి నుంచి ఆరోగ్యం పై అశ్రద్ధ వహించకుండా పరిశుభ్రతను పాటించి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ కలలు కన్న విధంగా విద్యార్థులు ప్రతి ఒక్కరూ వివిధ రంగాల్లో ప్రయోజకులు కావాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన మాత్రలను వృథా చేయకుండా వేసుకుంటే ఫైలేరియా, నులి పురుగుల వ్యాధులను అరికట్టవచ్చని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ పోలీసు రాజులు, మిరుదొడ్డి, భూంపల్లి పీహెచ్‌సీల వైద్యులు మల్లికార్జున్‌, ఎస్‌వో స్వర్ణలత, సీహెచ్‌వో లింగమూర్తి, టీఆర్‌ఎస్‌ నేతలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


నులిపురుగు నివారణ మాత్రల పంపిణీ

రాయపోల్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం నులిపురుగు దినోత్సవం సందర్భంగా పిల్లలకు మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనిత, ఎంపీడీవో స్వర్ణకుమా రి, వైద్యాధికారి శ్రీధర్‌ తదితరులు మండల కేంద్రంలోని క స్తూర్బాం గాంధీ పాఠశాలల్లో విద్యార్ధులకు మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 


దౌల్తాబాద్‌: ప్రతి ఒక్కరూ నులిపురుగులు, బోదకాల వ్యాధి నివారణ మాత్రలను వేసుకోవాలని ఎంపీటీసీ దేవేందర్‌, వైద్యాధికారి రమాదేవి అన్నారు. సోమవారం మండలంలోని తిర్మలాపూర్‌, గాజులపల్లి, చెట్లనర్సంపల్లి, అప్పాయిపల్లి, ఇందుప్రియా ల్‌ గ్రామాల్లో విద్యార్థులకు జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని పురస్కరించుకొని ఆయా గ్రామల సర్పంచ్‌లు ఎంపీటీసీలతో కలిసి అల్బెండజోల్‌ మాత్రలు వేశారు. logo