గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Feb 09, 2020 , 23:30:11

తన్మయత్వం

తన్మయత్వం
  • సుమారు 40వేల మందికి పైగా దర్శనం
  • మల్లన్న నామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణం
  • కొమురవెల్లి మల్లన్న దర్శనంతో భక్తుల పరవశం

 చేర్యాల, నమస్తే తెలంగాణ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. 4వ వారం భక్తులు స్వామి వారిని  40వేల మంది భక్తులు కొమురవెల్లికి తరలివచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపారు. స్వామి వారి సన్నిధిలో తమ మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు శనివారం ఉదయం నుంచే మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. అనంతరం ఆలయ నిర్వహణలో ఉన్న గదులతో పాటు ప్రైవేటుగా ఉన్న గదులు అద్దెకు తీసుకుని బస చేశారు. ఆదివారం వేకువజామునే నిద్రలేచి కోనేటిలో పవిత్ర స్నానం అచరించి నేరుగా స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల పాటు వేచి ఉండి స్వామి వారిని దర్శించుకుని కోర్కెలు తీర్చాలని వేడుకున్నారు. భక్తులు అర్చన, ప్రత్యేక పూజలు, కేశఖండన, మహామండప, చిలుక పట్నం, బోనం, టెంకాయలు, హుండీలలో కానుకలు వేసి మొక్కులు తీర్చుకున్నారు.మరి కొందరు భక్తులు తమ మొక్కులు తీర్చాలని గంగరేగు చెట్టు వద్ద ముడుపులు, సంతానం కలగాలని మరికొందరు ఒల్లు బండ పూజలు, రాతిగీరల వద్ద మొక్కులు, కోడెను కట్టివేసి స్వామి వారిని వేడుకున్నారు. భక్తులకు మల్లన్న ఆలయ పునరుద్ధరణ కమిటీ  చైర్మన్‌ మేక సంతోష్‌, డిప్యూటీ కమిషనర్‌ టి.వెంకటేశ్‌, కమిటీ సభ్యులు ముత్యం నర్సింహులు, బొంగు నాగిరెడ్డి, ఏగుర్ల మల్లయ్య, ఆలయ ఏఈవోలు రావుల సుదర్శన్‌, కత్తి శ్రీనివాస్‌, ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్‌, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు సేవలందించారు. 

తాజావార్తలు


logo