బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 09, 2020 , 23:27:27

నులి పురుగు నివారణ

నులి పురుగు నివారణ
  • ఫైలేరియాను పారదోలుదాం
  • 10,32,500 మందికి పంపిణే లక్ష్యం
  • ఫైలేరియా, నులి పురుగుల నివారణకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం
  • నేటి నుంచి మూడు రోజుల పాటు మాత్రల పంపిణీ

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ :  జిల్లాలో నులి పురుగు నివారణ, ఫైలేరియా వ్యాధిని అరికట్టేందుకు మాత్రలను ఈ నెల 10,11,12 తేదీలలో పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే సిబ్బందికి మాత్రల పంపిణీపై ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. జేసీ పద్మాకర్‌ నేతృత్వంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో వందశాతం మాత్రలను వేయించడమే లక్ష్యంగా ప్రణాళిక  రూపొందించారు. మెత్తం జిల్లా లో 11,35,750 మంది ఉండ గా 10,32,500 మందికి మాత్రలను మింగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మాత్రలను పంపిణీ చేసేందుకు 4,290 మంది అడ్మినిస్ట్రేటర్లను నియమించారు. 2,145 టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో ముగ్గురు సభ్యులను నియమించారు. అందులో ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు డ్రగ్‌ అడ్మినిస్ట్రేటర్లు ఉంటారు. ఒక్కో టీం సుమారుగా 500 మందికి  మాత్రల పంపిణీ చేస్తున్నది. దీనిని పర్యవేక్షించేందుకు 429 మంది సూపర్‌ వైజర్లను నియమించారు. 37 మంది ర్యాపిడ్‌రెస్పాండ్‌ టీంలను సిద్ధం చేశారు. మాత్రల పంపిణీ కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసేలా చర్యలు చేపట్టారు. మాత్రలను రెండు సంవత్సరాల లోపు  పిల్లలు, గర్భిణులు, తీవ్రమైన అనారోగ్యంకు గురైనవారు, ఖాళీ కడుపున మాత్రలను తీసుకోవద్దని వైద్యులు తెలిపారు. 


logo