శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 09, 2020 , 23:26:35

పనులు వేగంగా జరగాలి

పనులు వేగంగా జరగాలి

సిద్దిపేట అర్బన్‌ : సుడా సుందరీకరణ పనులు వేగంగా జరుగాలి. ఆదాయ మార్గాలు అన్వేషించాలి..అన్నివిధాలుగా అభివృద్దితో పాటు ఆదా యం పెరగాలి. జంక్షన్ల సుందరీకరణ అద్భుతమైన రీతిలో ఉండాలి.. సిద్దిపేటలో పెళ్లి జరిగితే...మొక్కలు ఇచ్చే పద్ధతి తేవాలి అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సుడా డైరెక్టర్లు, వైస్‌ చైర్మన్‌ రమణాచారికి దిశా నిర్దేశం చేశారు. సిద్దిపేట సుడా కార్యాలయ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆదివారం రాత్రి సుడా వర్టికల్‌ గార్డెన్‌ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించి అనంతరం సుడా అభివృద్ధ్ది, పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో భాగం గా 10 కిలో మీటర్ల వరకు అటవీ సంపద పెం పొందించాలని మంత్రి సమక్షంలో చర్చించి నిర్ణయించారు. సుడా పరిధిలోగల పది కిలో మీటర్ల మేర సెంట్రల్‌ మీడియంగా రెండు వైపులా కాగితపు చెట్లు బాగుంటుందని మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఈ మేరకు సిద్దిపేటకు వచ్చే పొన్నాల దాబా వద్ద రాజీవ్‌ రహదారిపై సుందరీకరణ చేస్తూ ఓ జంక్షన్‌ నిర్మాణం చేపట్టాలని అందుకు అవసరమైన ఆర్కిటెక్ట్‌ గీసిన నమూనాల చిత్రాలను పరిశీలించి తుది మెరుగులు దిద్ది తొందరగా అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. సుడా అభివృద్దికోసం శాశ్వత ఆదాయం వచ్చేలా అన్వేషణ చేయాలని సుడా అధికారిక యంత్రాంగం, పాలక వర్గాన్ని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ మారెడ్డి రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ కడవేర్గు రాజనర్సు , వైస్‌ చైర్మన్‌ రమణాచారి, సుడా డైరెక్టర్లు మచ్చ వేణు, చంద్రశేఖర్‌, బర్లమల్లిఖార్జున్‌, ఇతర డైరెక్టర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు  పాల్గొన్నారు.logo