శుక్రవారం 05 జూన్ 2020
Siddipet - Feb 09, 2020 , 23:22:28

పులకించిన చదువుల తల్లి..

పులకించిన చదువుల తల్లి..

 ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్థి దశ కీలకం. చిన్ననాటి స్నేహితులు పలుకరించినా, సంభాషించినా కండ్ల ముందు తారసపడితే ఆనందంతో మాటలు రావు. అలాంటిది అపురూప క్షణాలకు సిద్దిపేట మల్టీపర్పస్‌ పాఠశాల వేదికైంది. స్వా తంత్య్రానికి ముందు ఏర్పడ్డ పాఠశాల... అక్కడ చదివిన విద్యార్థులందరూ ఒకే సారి కండ్ల ముందు కదలాడే అద్భుత ఘట్టం సిద్దిపేట మల్టీపర్పస్‌ పాఠశాలలో సాక్షాత్కరమైంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం రెండు రోజులుగా నయాననందకరంగా మారింది. చదువులమ్మ ఒడిలో చదివిన వారందరూ ప్లాటినం జూబ్లీ వేడుకలకు ఖండంతరాలు దాటి వచ్చి స్నేహితులను కలుసుకొని పలుకరించుకున్నారు. చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పాఠశాలపై ఉన్న మక్కువను చాటుకున్నారు. తీపి జ్ఞాపకాలను నెమరువేసుకొని శతాబ్ది ఉత్సవాలకు అందరం కలుసుకుందామంటూ పూర్వ విద్యార్థులు ప్రతీనబూనారు. 


logo