శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 08, 2020 , 23:19:48

హుస్నాబాద్‌లో భారీ వర్షం

హుస్నాబాద్‌లో భారీ వర్షం
  • ప్రధాన రహదారులు జలమయం
  • మధ్యాహ్నం చిరుజలుల్లతో ప్రారంభం
  • జనజీవనానికి అంతరాయం

హుస్నాబాద్‌, నమస్తే తెలంగాణ : హు స్నాబాద్‌ పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి చిరు జల్లులతో ప్రారంభమైన వర్షం.. సాయంత్రం భారీగా కురిసింది. సుమారు పావుగంటపాటు కుండపోత వర్షం కురవడంతో ప్రజలు అతలాకుతలం అయ్యారు. ఊహించని విధంగా భారీ వర్షం పడడంతో వాహనదారులు, దుకాణాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని లోతట్టు ప్రాం తాలతో పాటు ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. మార్కెట్‌లో కందుల కొనుగోలు కేంద్రం నడుస్తున్నప్పటికీ కం దులు మొత్తం షెడ్ల కిందనే ఉండడంతో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ప్రస్తుతం చేతికొచ్చే పంటలు ఏమీ లేకపోవడంతో పం టలకు పెద్దగా నష్టం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఏదేమైనా అకాల వర్షం జనజీవనానికి కొంత అంతరాయం కలిగింది.


కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : సిద్దిపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి మబ్బులు, చిరుజల్లులతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం 10 గంటల నుంచే చిరుజల్లులు మొదలయ్యాయి. సాయంత్రం మబ్బులతో కూడిన వాన కురిసింది. వాతావరణం చల్లబడి చల్లని గాలులు వీస్తుండడంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బంది పడ్డారు. 


 మధ్యాహ్న ప్రాంతంలో..

కోహెడ : మండలంలో అకాల వర్షం కురిసింది. ఉదయం మబ్బు పట్టి మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చిరుజల్లులతో మొదలై వర్షం కురిసింది. అకాల వర్షంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.  తీవ్రమైన చలిగాలులు వీయడంతో వణుకు పట్టారు. 


ఆరుతడి పంటలకు జీవం..

తొగుట : మండలంలో భారీ వర్షం కురిసింది. మండల వ్యా ప్తంగా వాన పడడంతో పంట పొలాలకు ఎంతో కొంత మేలు జరిగింది. ఆరుతడి పంటలకు ఉపయోగకరంగా మారిందని రైతులు పేర్కొంటున్నారు. కాగా, పత్తి, మొక్కజొన్న పొలాలను ట్రాక్టర్లతో దుక్కి చేసుకోవడానికి రైతులు సిద్ధమవుతున్నారు. 


logo