గురువారం 04 జూన్ 2020
Siddipet - Feb 08, 2020 , 23:18:42

గజ్వేల్‌ ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలకు ఐఎస్‌వో గుర్తింపు

గజ్వేల్‌ ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలకు ఐఎస్‌వో గుర్తింపు

గజ్వేల్‌ టౌన్‌: గజ్వేల్‌ విద్యాసౌధంలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలకు ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌(ఐఎస్‌వో) గుర్తింపు లభించింది. శనివారం హైదరాబాద్‌లోని ఓయూలో జరిగిన ఓ కార్యక్రమంలో కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ చేతుల మీదుగా కళాశాల ప్రిన్సిపాల్‌ ఏ శ్రీనివాస్‌రెడ్డి సర్టిఫికెట్‌ను అందుకున్నారు. గజ్వేల్‌ పట్టణంలో 1997లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభమైంది. ప్రారంభంలో 97 మంది ఉండగా, ప్రస్తుతం 900కు పైగా మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌ ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా సకల సౌకర్యాలను విద్యార్థులకు కల్పిస్తున్నారు. సుమారు రూ.19 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో కార్పొరేట్‌కు దీటుగా 2018 నుంచి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం కళాశాలలో 12 డిగ్రీ కోర్సులు, 3 పీజీ కోర్సులు నిర్వహిస్తున్నారు. కళాశాలకు ఐఎస్‌వో గుర్తింపు లభించడం గర్వంగా ఉందని, త్వరలో జరుగబోయే న్యాక్‌ రీఅక్రిడేషన్‌ ప్రక్రియకు ఈ ఐఎస్‌వో గుర్తింపు అనుకూలంగా మారే అవకాశం ఉందని, ఈ స్ఫూర్తితో రెట్టించిన ఉత్సాహంతో, అంకితభావంతో కళాశాల అభివృద్ధికి విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ప్రిన్సిపాల్‌ తెలిపారు.


logo