శుక్రవారం 05 జూన్ 2020
Siddipet - Feb 08, 2020 , 23:18:42

జనంలోంచి వనంలోకి..

జనంలోంచి వనంలోకి..

హుస్నాబాద్‌, నమస్తే తెలంగాణ : పట్టణంలో జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతరలో శనివారం అమ్మవార్లను జడ్పీ వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి దర్శించుకున్నారు. జాతర చివరి రోజు కావడంతో అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు చేసి బంగారం సమర్పించారు. ప్రజలందరూ సంతోషంగా జీవిం చేలా దీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు జడ్పీ వైస్‌ చైర్మన్‌ తెలిపారు. అమ్మవార్లను దర్శించుకున్నవారిలో మార్కెట్‌ చైర్మన్‌ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ ఇన్‌చార్జి కాస్ల అశోక్‌బాబు, నాయకులు అయిలేని శంకర్‌రెడ్డి, భూక్య రమేశ్‌నాయక్‌ తదితరులు ఉన్నారు. 


వనంలోకి సమ్మక్క-సారలమ్మ...

బెజ్జంకి : మండలంలోని దేవక్కపల్లి, తోటపల్లి, వడ్లూర్‌, గుండారం గ్రామాల్లో జాతరలో భాగంగా వనదేవతలు వన ప్రవేశం చేశారు. కొయ్యపూజారులు ప్రత్యేక పూజల అనంతరం అమ్మవార్లను వనప్రవేశం చేశారు. వడ్లూర్‌లో టీఆర్‌ఎస్‌ నాయకుడు తన్నీరు శరత్‌రావు వనప్రవేశ పూజలో పాల్గొన్నారు.  


వనప్రవేశం చేసిన వనదేవతలు

కొమురవెల్లి : మండలకేంద్రంలోని పాత కమాన్‌ వద్ద  నాలు గు రోజులుగా కొనసాగిన సమ్మక్క- సారక్క జాతర అమ్మవార్లు వనప్రవేశం చేయడంతో జాతర ముగిసింది. దేవతలకు నిర్వాహకుడు చింతల రామ్మూర్తి  ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లులను వనప్రవేశం చేయించారు. భక్తులు అమ్మవార్లకు బంగారం సమర్పించి మొక్కులు అప్పజేప్పారు. 


ముగిసిన కూటిగల్‌ సమ్మక్క-సారలమ్మ జాతర

మద్దూరు : మండలంలోని కూటిగల్‌లో వన దేవత జాతర  ముగిసింది. కోయపూజరులు అమ్మవార్లను వనప్రవేశం చేయించారు. కాగా, సర్పంచ్‌ దోమ బాలమణి, జాతర కమిటీ చైర్మన్‌ పిల్లి కనకయ్య తదితరులు భక్తులకు ధన్యవాదాలు తెలిపారు.   


logo