శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 08, 2020 , 00:31:59

మంత్రి హరీశ్‌రావుకు మెజార్టీ

మంత్రి హరీశ్‌రావుకు మెజార్టీ
  • తల్లులకు మొక్కు

హుస్నాబాద్‌, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హరీశ్‌రావు లక్ష మెజార్టీతో గెలిస్తే, ఆయనంత ఎత్తు బంగారం ఇస్తానని మొక్కిన ఓ కుటుంబం మొక్కు తీర్చుకునేందుకు శుక్రవారం మేడారం జాతరకు పయనమయ్యారు. సిద్దిపేట రూరల్‌ మండలం బక్రీచెప్యాలకు చెందిన రైతు సమన్వయ సమితి సభ్యురాలు నెల్లుట్ల నర్సవ్వ, ఆమె కొడుకు టీఆర్‌ఎస్వీ జిల్లా కార్యదర్శి నెల్లుట్ల విజయ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హరీశ్‌రావు భారీ మెజార్టీతో గెలిస్తే సమ్మక్క-సారలమ్మలకు ఎత్తు బంగారం ఇస్తామని మొక్కుకున్నారు. వారు మొక్కున్నట్లే హరీశ్‌రావు లక్షకు పైగా మెజార్టీ సాధించారు.

దీంతో మొక్కు తీర్చుకునేందుకు నర్సవ్వ, విజయ్‌ తమ కుటుంబ సభ్యులతో సహా హుస్నాబాద్‌కు వచ్చి మంత్రి బరువైన 88కిలోల ఎత్తు బంగారం తూకం వేసి మేడారం జాతరకు తరలివెళ్లారు. త్రాసుపై మంత్రికి బదులు మంత్రి చిత్రపటంతో విజయ్‌ కూర్చొని ఎత్తు బంగారం ఇచ్చాడు. మంత్రిపై ఉన్న అభిమానంతో కుటుంబంతో సహా అమ్మవార్లకు ఎత్తుబంగారం ఇవ్వడం పట్ల స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కుమ్మర సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నమిలికొండ అయిలయ్య, మాజీ కౌన్సిలర్‌ నమిలికొండ రాజయ్య, టీఆర్‌ఎస్‌ నాయకుడు గొర్ల నాగయ్య, కాపర్తి సాగర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo