సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 07, 2020 , T00:40

గద్దెనెక్కిన సమ్మక్క

గద్దెనెక్కిన సమ్మక్క

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ/ హుస్నాబాద్ టౌన్ : వన దేవతలు సమ్మక్క-సారలమ్మ అమ్మవార్ల కృపతో జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ అన్నారు. గురువారం పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు సమీపంలో జరుగుతున్న సమ్మక్క-సారలమ్మ జాతరలో ఆయన అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అనితాశ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ భూక్య మంగ, ఎన్‌ఎల్‌సీఎఫ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, కౌన్సిలర్లు సుప్రజ, రాజు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, నేతలు నవీన్‌రావు, శంకర్‌రెడ్డి, రమణారెడ్డి, నర్సింహరెడ్డి, కొడముంజ రమేశ్, అయూబ్‌పాషా పాల్గొన్నారు.  

అమ్మలను దర్శించుకున్న ఎమ్మెల్యే రసమయి 

బెజ్జంకి : మండలంలోని దేవక్కపల్లి, తోటపల్లి, గుండారం గ్రామాల్లో సమ్మక్క-సారలమ్మ జాతరకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యాయి. వనదేవతలకు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. మూడు గ్రామాలతోపాటు వడ్లూర్ గ్రామస్త్తులు భారీగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని ఎత్తుబంగారం, ఎదుర్కోళ్లు వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే వెంట టీఆర్‌ఎస్ నాయకుడు తన్నీరు శరత్‌రావు, ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రావుల రామకృష్ణరెడ్డి, సర్పంచ్ బొయినిపల్లి నర్సింగరావు, ఎంపీటీసీ లక్ష్మి పాల్గొన్నారు.

అక్కెనపల్లిలో మొక్కులు తీర్చుకున్న నాయకులు 

నంగునూరు : మండలంలోని అక్కెనపల్లిలో సమ్మక్క- సారలమ్మ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు సమ్మక్కను గద్దెనెక్కించారు. అమ్మలను దర్శించుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చి, నిలువెత్తు బంగారం సమర్పించుకొని  మొక్కులు తీర్చుకున్నారు. మాజీ ఎంపీపీ  శ్రీకాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు దువ్వల మల్లయ్య, కిష్టారెడ్డి, సర్పంచ్‌లు భిక్షపతినాయక్, అజీజ్, నర్సింలు తదితరులు అమ్మవార్లకు పూజలు చేశారు.

నేడు పూజలు అందుకోనున్న అమ్మలు

కొమురవెల్లి : పాత కమాన్ వద్ద సమ్మక్క గద్దెనెక్కింది. సమ్మక్క తల్లికి భక్తు లు, శివసత్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలుకల గుట్ట వద్ద నుంచి ఊరేగింపుగా సమ్మక్క తల్లిని గద్దెపైకి తీసుకువచ్చారు. నేడు ఇద్దరు దేవతలు భక్తుల పూజలను అందుకోనున్నట్లు నిర్వాహకుడు రామ్మూర్తి తెలిపారు.

 కూటిగల్‌లో సమ్మక్కకు ప్రత్యేక పూజలు

మద్దూరు : మండలంలోని కూటిగల్‌లో అమ్మలకు ఎంపీపీ  కృష్ణారెడ్డి ప్రత్యే క పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మల్లన్న ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ మేక సంతోశ్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు యాదగిరి, సర్పంచ్‌లు బాలమణి, శివలాల్, రాజమల్లయ్య, మాజీ సర్పంచ్ బర్మ, జాతర చైర్మన్ పిల్లి కనకయ్య, నేతలు కనకయ్య, అల్లం యాదయ్య, రూపేశ్ ఉన్నారు. 

మొక్కులు సమర్పించిన ఎమ్మెల్యే  సతీశ్‌కుమార్

కోహెడ : మండలంలోని వింజపల్లి, పర్వేద, తంగల్లపల్లిల్లోని సమ్మక్క-సారలమ్మలను ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ సందర్శించి, మొక్కు సమర్పించారు. కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి, మండల అధ్యక్షుడు  మహేం దర్, నేతలు నర్సింహరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, కృష్ణమూర్తి, రాములు, శ్రీకాంత్,  రాజమౌళి, సర్పంచ్‌లు లింగం గీతాంజలి, నాగేశ్వరి, తిరుపతిరెడ్డి ఉన్నారు.

 జనంలోకి వచ్చిన సమ్మక్క-సారలమ్మ

హుస్నాబాద్ రూరల్ : మండలంలోని పొట్లపల్లి, అక్కన్నపేట మండలం  గోవర్ధనగిరి గ్రామాల్లో సమ్మక్క తల్లిని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్  సమ్మక్క తల్లిని దర్శించుకున్నారు. సమ్మక్కను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.


logo