శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 07, 2020 , T00:10

సహకార ఎన్నికల నిబంధనలు పాటించాలి

సహకార ఎన్నికల నిబంధనలు పాటించాలి

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: సహకార సంఘాల ఎన్నికల నిబంధనలను పూర్తిగా తెలుసుకొని అందుకనుగుణంగా అభ్యర్థులు, ఓటర్లు నడుచుకోవాలని ఏసీపీ ఎస్ మహేందర్ అన్నారు. గురువారం హుస్నాబాద్, కట్కూరు, కోహెడ సహకార సంఘం కార్యాలయాల్లో జరుగుతున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సహకార సంఘం డైరెక్టరుగా పోటీ చేస్తున్న సభ్యులు నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అందరూ సహకరించాలన్నారు. నామినేషన్ వేసేందుకు గుంపులు, గుంపులుగా రావొద్దని, ర్యాలీలకు అనుమతులు లేవన్నారు. సహకార ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎన్నికల అధికారులు వెంకటయ్య, శ్రీనివాస్, చంద్రమౌళి, సీఈవోలు సతీశ్, మల్లికార్జున్, మధుసూదన్, ఎస్‌ఐ పాపయ్యనాయక్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 


logo