మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 07, 2020 , T00:05

జిల్లాలో తొలి రోజు 62 నామినేషన్లు

జిల్లాలో తొలి రోజు 62 నామినేషన్లు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రాథమిక వ్యవసాయ సహకార ఎన్నికల్లో తొలి రోజు 62 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని 21 సొసైటీల్లో నామినేషన్లు స్వీకరించారు. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుండడంతో ఇవాళ రేపు భారీగా నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఆయా సొసైటీల పరిధిలో నామినేషన్ల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. తొలి రోజు పీఏసీఎస్ వర్గల్, పీఏసీఎస్ కట్కూర్, పీఏసీఎస్ ములుగు, పీఏసీఎస్ పాలమాకుల సొసైటీలు మినహా అన్ని సొసైటీల్లో నామినేషన్లు దాఖలైనట్లు  డీసీవో మనోజ్‌కుమార్ తెలిపారు. పీఏసీఎస్ సిద్దిపేటలో -8, పీఏసీఎస్ కొండపాకలో -2, పీఏసీఎస్ గజ్వేల్‌లో -1, పీఏసీఎస్ జగదేవ్‌పూర్‌లో -5, పీఏసీఎస్ రేబర్తిలో -3, పీఏసీఎస్ మిరుదొడ్డిలో -4, పీఏసీఎస్ అల్లీపూర్‌లో -2, పీఏసీఎస్ చేర్యాలలో -4, పీఏసీఎస్ హుస్నాబాద్‌లో -9, పీఏసీఎస్ మిట్టపల్లిలో -4, పీఏసీఎస్ గంగాపూర్ -8, పీఏసీఎస్ నంగునూరులో -1, పీఏసీఎస్ దుబ్బాకలో -4, పీఏసీఎస్ కాన్గల్‌లో -1, పీఏసీఎస్ దౌల్తాబాద్‌లో -2, పీఏసీఎస్ కోహెడలో -1, పీఏసీఎస్ బెజ్జంకిలో -3 మొత్తం 62 నామినేషన్లు దాఖలయ్యాయి. 

 నామినేషన్ల స్వీకరణకు రేపు చివరి గడువు  

సహకార ఎన్నికలకు 21 సొసైటీల పరిధిలో తొలి రోజు 62 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణకు రేపటితో గడువు ముగియనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా సొసైటీల పరిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో నామినేషన్లను స్వీకరిస్తున్నారు. మొత్తం 21 సొసైటీల పరిధిలో 273 డైరెక్టర్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వరుస విజయాలతో టీఆర్‌ఎస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నది. ఇప్పటికే ఆయా సొసైటీల పరిధిలోని డైరెక్టర్ పదవులకు పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసింది. కొన్ని సొసైటీల్లో కూడా చైర్మన్ స్థానాలను కూడా ఖరారయ్యాయి. మిగతా పార్టీలు అభ్యర్థుల వేటలో ఉన్నారు. 


logo