మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 06, 2020 , 00:07:03

కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి కల్యాణానికి ఏర్పాట్లు

కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి కల్యాణానికి ఏర్పాట్లు

నంగునూరు: కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడు.. భక్తుల ఇలవేల్పు.. నమ్మిన వారి కొంగుబంగారం.. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులకు ఆరాధ్య ఆలయమైన నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయం 46వ వార్షికోత్సవాలకు ముస్తాబైంది.  ఉత్సవాలకు ఆలయ కమిటీ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వెంకటేశ్వర స్వామి కల్యాణమహోత్సవం ఫిబ్రవరి 7 నుంచి మూడ్రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వంహించనున్నారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావును కలిసి కల్యాణానికి రావాలని ఆహ్వానించారు.  


మూడ్రోజుల పాటు కల్యాణోత్సవాలు 

వెంకన్నస్వామి కల్యాణం పురస్కరించుకొని ఈ నెల 7న శుక్రవారం ఉదయం 8.30 గంటలకు పుణ్యవాచనం, అంకురారోపణం, ధ్వజారోహణ,  12.35 గంటలకు శ్రీస్వామి వారి కల్యాణం, నివేదన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం, రాత్రి 8 గంటల నుంచి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథా కార్యక్రమం, 8న శనివారం ఉదయం 8.10 గంటలకు సహస్రనామార్చన, నిత్యహోమం, స్వామి వారి నివేదన హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వియోగం, సాయంత్రం 5 గంటలకు శకటోత్సవం (బండ్లు తిరుగుట), రాత్రి 7 గంటలకు హోమం, స్వామి వారి నివేదన, హారతి, మంత్రపుష్పం, 9న ఆదివారం ఉదయం 9 గంటలకు శేషహోమం, స్వామి వారి నివేదన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వినియోగం, 10 గంటల నుంచి సాయంత్రం వరకు అన్నదానం, 4 గంటలకు నాగబలి, స్వామి వారి ఊరేగింపు సేవ, రాత్రి 8.30 గంటలకు సప్త ఆవరణముల ఏకాంత సేవలు జరుగుతాయి.


logo