శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 05, 2020 , 00:28:24

కందులే కందులు

కందులే కందులు

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : రైతును దళారుల బారి నుంచి కాపాడి పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఇందులో భాగంగా ధాన్యం, మొక్కజొన్నతోపాటు పత్తిని కొనుగోలు చేసింది. తాజాగా కంది రైతులకు మద్దతు ధర ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కందులకు క్వింటాల్‌కు రూ.5800 మద్దతు ధర ఇస్తూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. 

జిల్లాలో కందులకు మద్దతు ధర ఇవ్వడానికి మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో 7 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటికే సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆర్థిక శాఖ మంత్రి  హరీశ్‌రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. సిద్దిపేటతో పాటు చేర్యాల ఏఎంసీ, గజ్వేల్‌ ఏఎంసీ, హుస్నాబాద్‌ ఏ ఎంసీ, దుబ్బాక ఏఎంసీ, బెజ్జంకి ఏఎంసీ, నంగునూరు మార్కెట్‌ కమిటీ ల్లో కంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నారు. సిద్దిపేటలో కందుల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 55 మంది రైతుల నుంచి 788 బ్యాగుల కందులు మొత్తం గా  394 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. సుమారుగా రూ.22 లక్షల 85 వేల 200 విలువైన కందులను కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్‌ అధికారులు తెలిపారు. అన్నిసెంటర్లలోనూ కంది కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు. రైతులు కందులను దళారులకు అమ్మ వద్దని సూచించారు. 

  ప్రభుత్వం రూ.5800 ధర ఇస్తుంది 

రెండెకరాల్ల్లో మొక్కజొన్నలో కంది సాళ్లు పోసిన. కంది కోసి, వాటిని కొట్టి మార్కెట్‌కు తెచ్చిన. గతంలో బయట వ్యాపారులు చెప్పిన రేటుకే ఇచ్చేటోళ్లం. క్వింటాల్‌కు రూ.5800 ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో కం దులు తెచ్చి సిద్దిపేట మార్కెట్‌లో ఎండబోసిన. ఇక్కడ అన్ని సౌలతులు ఉన్నయి.     - కోడూరి బాలవ్వ (రాఘవాపూర్‌) 


logo