శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 05, 2020 , 00:31:20

గజ్వేల్‌ ప్రభుత్వ దవాఖానలో.. యూరాలజీ శస్త్రచికిత్సలు

గజ్వేల్‌ ప్రభుత్వ దవాఖానలో.. యూరాలజీ శస్త్రచికిత్సలు

 గజ్వేల్‌ రూరల్‌ : పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో ప్రజలకు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం నుంచి యూరాలజీ శస్త్ర చికిత్సలు (మూత్రశయం, కిడ్నీ) ప్రారంభమయ్యాయి. దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహేశ్‌ ఆధ్వర్యంలో యూరాలజీ వైద్యులు కృష్ణ, కార్తీక్‌ తదితరులు వర్గల్‌ మండలం జబ్బాపూర్‌ గ్రామానికి చెందిన శంకరమ్మకు కిడ్నీ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్‌ చేసి భారీ సంఖ్యలో కిడ్నీ నుంచి రాళ్లను తొలిగించడంతో శంకరమ్మ దాదాపు ఐదేండ్లుగా పడుతున్న బాధ నుంచి ఉపశమనం పొందింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డా.మహేశ్‌ మాట్లాడుతూ గజ్వేల్‌ ప్రాంత ప్రజలకు గుండె, ఎముక, గైనకాలజీ, యూరాలజీ వైద్యసేవ లను అందేస్తున్నట్లు తెలిపారు. శస్త్ర చికిత్సలో డాక్టర్‌ ప్రవీణ్‌, సూర్య ప్రభాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.   logo