మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 05, 2020 , 00:27:11

‘సొసైటీ’లో మనదే విజయం

‘సొసైటీ’లో మనదే విజయం

చేర్యాల, నమస్తే తెలంగాణ : రైతు రాజ్య స్థాపనకు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌ను ఆదరరించడానికి ఈ నెల 15న జరిగే సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థ్ధులను గెలిపించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని కడవేర్గు ఊర చెరువు, పోతిరెడ్డిపల్లిలోని మారెడ్డి చెరువును గోదావరి జలాలతో నింపారు.   ఈ మేరకు ఆయా గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే పర్య టించి, చెరువులను పరిశీలించి పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గోదావరి నది పై దేవాదుల ప్రాంతంలో  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాఫర్‌ డ్యాం నిర్మించడంతో చేర్యాల ప్రాంతానికి గోదావరి జలాలు పం పింగ్‌ అవుతున్నాయని తెలిపారు. దీంతో కుంటలు, చెరువులను మత్తడి దూకే వరకు నింపుతున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో గోదావరి జలాలతో రైతన్నల పాదాలను కడుగుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో నీళ్ల మంత్రిగా పని చేసిన పొన్నాల లక్ష్మయ్య తన స్వలాభం కోసం  పని చేశారని ఆరోపించారు. రానున్న రోజుల్లో మల్లన్నసాగర్‌ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేసేందుకు సీఎం కేసీఆర్‌ అనుమతి ఇచ్చారని, త్వరలో కాల్వల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే తెలిపారు.  

మున్సిపల్‌ ఫలితాలతో చరిత్ర సృష్టించాం..

మున్సిపల్‌ ఎన్నికల్లో గతంలో ఏ పార్టీ సాధించని స్థానాల ను టీఆర్‌ఎస్‌ గెలుచుకుని చరిత్ర సృష్టించిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి అన్ని వర్గాలు అండగా ఉండాలని కోరారు.  కార్యక్రమంలో ఎంపీపీ   కరుణాకర్‌, జడ్పీటీసీ మల్లేశం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు  మల్లేశం, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్‌లు స్వప్నస్వామి, కృష్ణవేణిశ్రీనివాస్‌రెడ్డి, ఎల్లారెడ్డి, ఎంపీటీసీ బాలరాజు,  కౌన్సిలర్లు ఆడెపు నరేందర్‌, మంగోలు చంటి, పచ్చిమడ్ల సతీశ్‌, కోఆప్షన్‌ సభ్యుడు నాజర్‌, నేతలు శివగారి అంజయ్య, గోనే హరి, తాడెం కృష్ణమూర్తి ఉన్నారు.

తాజావార్తలు


logo