శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 05, 2020 , 00:24:46

పవిత్ర గ్రంథం భారత రాజ్యాంగం

పవిత్ర  గ్రంథం భారత రాజ్యాంగం

సిద్దిపేట టౌన్‌ : భిన్నత్వంలో ఏకత్వం భారతదేశమని, హిందూ, ముస్లింల సఖ్యతను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్‌ మండిపడ్డారు. సిద్దిపేట ప్రెస్‌ క్లబ్‌లో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై పడే ప్రభావంపై మంగళవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అద్దంకి దయాకర్‌ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు పాలించమని ప్రజలు ప్రధాని మోదీకి అవకాశం ఇస్తే కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతూ నియంత్రృత్వ ధోరణితో వెళ్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ సైతం కేంద్రం తీసుకవచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడం మంచి పరిణామమన్నారు. దేశంలో వందల సంవత్సరాలుగా జీవిస్తున్న వారందరినీ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం అనైతికమని చెప్పారు. ఓట్ల కోసం చేసే జిమ్మిక్కేనని తేల్చారు. అవకాశవాది చట్టాలను తీసుకవస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  భారత రాజ్యాంగం పవిత్ర గ్రంథమని చెప్పారు. మత ప్రాతిపదికన పౌరసత్వం ఇస్తామనడం లౌకికవాదానికి విరుద్ధమని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీని సైతం కేంద్ర ప్రభుత్వం నిందించడం సిగ్గు చేటన్నారు.  వెంటనే సీఏఏ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో లంబాడ హక్కుల పోరాట సమితి నాయకుడు బెల్లయ్యనాయక్‌, యాదగిరి, అబ్దుల్‌ ముక్తీ సయ్యద్‌, శ్రీనివాస్‌, దేవయ్య, కలీమొద్దీన్‌, సజ్జు, ముత్యాల భూపాల్‌, రవి, వినయ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు. 


logo