గురువారం 01 అక్టోబర్ 2020
Siddipet - Feb 02, 2020 , 22:41:45

మల్లన్న ఆలయాభివృద్ధి కోసం కృషి చేస్తా

మల్లన్న ఆలయాభివృద్ధి కోసం కృషి చేస్తా

తొగుట : తొగుటలో నూతనంగా నిర్మించిన మల్లన్న ఆలయ అ భివృద్ధి కోసం తనవంతు సహకారం అందిస్తానని శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హామీ ఇచ్చారు. తొగుట మల్లికార్జున స్వామి ప్రతిష్ఠామహోత్సవాల్లో బుధవారం ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులు సంఘటితంగా ఉండి ఆలయాన్ని నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సత్వరమే విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని విద్యుత్‌ ఏఈ అనిల్‌ కుమార్‌కు ఎమ్మెల్యే తన వం తుగా డీడీ డబ్బులు చెల్లించారు. దేవాలయాల నిర్మాణంతో సమాజంలో భక్తిభావం పెరుగుతుందని, సాత్విక ఆలోచనలు విస్తరిస్తాయన్నారు. ఆలయంలో నిత్య దూప, దీప నైవేద్యాలు జరిగేలా చూడాలని ఆయన కోరారు. అనంతరం తొగుటకు చెం దిన విశ్రాంత ఉపాధ్యాయుడు, టీఆర్‌ఎస్‌ నాయకుడు నర్సింహరెడ్డి తన తల్లి తండ్రుల స్మారకార్థం ఆలయం వద్ద ఏర్పాటు చేసిన హైమాస్ట్‌  లైట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యేకు యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు.  


అనంతరం వెంకట్రావుపేటకు చెందిన సుతారి రజిత, మణెమ్మలకు రూ.30వేలు, లింగాపూర్‌కు చెందిన కొత్తపల్లి లక్ష్మికి రూ.16వేలు, మహ్మద్‌ బేగానికి రూ. 16వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నియోజకవర్గంలో వందలాది మందికి సహాయం అందించామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో విద్యుత్‌ ఏఈ అనిల్‌ కుమార్‌, మండల పార్టీ అధ్యక్షుడు చిలువేరి మల్లారెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కంకణాల నర్సింహులు, సర్పంచ్‌ చిక్కుడు చంద్రం, నాయకులు గాంధారి నరేందర్‌రెడ్డి, నర్సింహరెడ్డి, యాదగిరి, సుతారి రమేశ్‌, బక్క కనకయ్య, అనిల్‌ కుమార్‌, రమేశ్‌, నర్సింహులు, సురేశ్‌గౌడ్‌, వెంకట్‌రెడ్డి, యాదవ సంఘం సభ్యులు  తదితరులు ఉన్నారు.


logo