శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 02, 2020 , 22:40:02

వైభవంగా మహంకాళిదేవి వార్షికోత్సవం

వైభవంగా మహంకాళిదేవి వార్షికోత్సవం

దుబ్బాక టౌన్‌ : దుబ్బాకలో కొలువైన మహంకాళిదేవి ఆలయ తృతీయ వార్షికోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవాల సందర్భంగా ఆలయంలోని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారి ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. పూజా కార్యక్రమంలో భాగమైన గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచామృతాభిషేకం అలంకరణ, మహిళలచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం దేవతాపూజ, పూర్ణాహుతి, మంగళహారతులు వంటి పూజా కార్యక్రమాలను వైదిక నిర్వాహకులు వేలేటి జయరామశర్మ, రామకృష్ణశర్మ ఘనంగా నిర్వహించారు. 


మున్సిపల్‌ చైర్‌పర్సన్‌కు సన్మానం

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనితని మహంకాళిదేవి ఆ లయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భం గా చైర్‌పర్సన్‌ వనిత మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.


logo