శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 01, 2020 , 23:12:41

తెల్లబంగారం కళకళ

తెల్లబంగారం కళకళ
  • పెరిగిన పత్తి క్రయవిక్రయాలు
  • జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 15,23,399 క్వింటాళ్ల కొనుగోలు
  • దళారుల నివారణకు పటిష్టమైన చర్యలు
  • సీసీఐ కేంద్రాల్లోనే అమ్మకాలు అధికం

 గజ్వేల్‌, నమస్తే తెలంగాణ : ప్రధాన వ్యాపార పంట పత్తి క్రయవిక్రయాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి ఇప్పటి వరకు 6 లక్షలకు పైగా క్వింటాళ్ల పత్తి అధికంగా కొనుగోళ్లు జరిగాయి. అలాగే, సీసీఐ రికార్డు స్థాయిలో పత్తిని కొనుగోలు చేసింది. ఎన్నడూ లేని వి ధంగా ఇప్పటికే 10,49,240 క్వింటాళ్ల పత్తిని రైతుల నుంచి సేకరించింది. ప్రైవేట్‌ వ్యాపారులు 4,74,154 క్వింటాళ్ల పత్తి  ని మాత్రమే కొనుగోలు చేశారు. ప్రైవేట్‌ మార్కెట్లో పత్తి ధర తక్కువగా ఉండడం.. సీసీఐ క్వింటాల్‌కు రూ.5550 చెల్లిస్తుంది. దీంతో రైతులు సీసీఐ కేంద్రాల్లో విక్రయించడానికే మొగ్గు చూపుతున్నారు. బహిరంగ మార్కెట్లలో మద్దతు ధర తక్కువ ఉండటంతో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయానికి రైతులు మొగ్గుచుపుతున్నారు. చిన్న, సన్నాకారుల రైతులు మాత్రం ప్రైవేట్‌ వ్యాపారులకే విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. 


జిల్లాలో వానాకాలంలో 2,25,000 ఎకరాల్లో పత్తి పంట సాగు జరిగింది. సుమారు 1,50,000 టన్నులకు పైగా దిగుబడి వస్తుందని అంచనా. జిల్లావ్యాప్తంగా రైతులకు మద్దతు ధర అందించడానికి ప్రభుత్వం సీసీఐ కొనుగోళ్ల కేం ద్రాలను అందుబాటులో తెచ్చింది. ప్రైవేట్‌ మార్కెట్లో పత్తి ధర మద్దతు ధరకు తక్కువగా ఉండటంతో సీసీఐ కేంద్రాలను రైతులకు అనుకూలంగా ఏర్పాటు చేసింది. తొమ్మిది మార్కెట్‌ యార్డులతోపాటు 23 జిన్నింగ్‌ మిల్లుల్లో సీసీఐ పత్తి కొనుగోళ్లు చేపట్టిం ది. 8 శాతం తేమ ఉండి నాణ్యమైన పొడుగు పింజా రకానికి క్వింటాల్‌ పత్త్తికి రూ. 5550 మద్దతు ధరను సీసీఐ ఇస్తుంది. అలాగే, 12శాతం మించి తేమ ఉన్నా, పత్తిలో నాణ్యత లోపించినా సీసీ ఐ కొనుగోలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో తేమ ఎక్కువగా ఉన్న పత్తిని రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. తొలుత వర్షాలు పడి తడిసి ముద్దయిన పత్తిని రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకే విక్రయించారు. ప్రతి రోజు ఒక్కో సీసీఐ కేంద్రంలో 80 మంది  రైతులకు టోకెన్లు ఇస్తున్నారు. పత్తి విక్రయించే రైతులు ఆయా కేంద్రాల వద్దకు వెళ్లి టోకెన్లను తీసుకోవాల్సి ఉంటుంది. టోకెన్ల సీరియల్‌ ప్రకారం ఏ రోజు పత్తిని తీసుకురమ్మంటే రైతు ఆ రోజు తీసుకెళ్లాల్సి ఉంటుంది. 


కొనుగోళ్లల్లో సీసీఐదే అధిక భాగం..

 జిల్లాలో జనవరి 31వ తేదీ వరకు మొత్తం 15,23,399 క్వింటాళ్ల పత్తి కొనుగోలు జరిగింది. దీనిలో రైతుల నుంచి 10,49,240 పత్తిని  సీసీఐ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. గత సంవత్సరం జనవరి 31 వరకు 98,980 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా, ఈ సారి 9,50,260 క్వింటాళ్ల పత్తిని అదనంగా కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 76,027 మంది రైతుల వద్ద 10,49,240 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ప్రైవేట్‌ వ్యాపారులు 4,77,152 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేయగా.. గతేడాది ఇదే సమయానికి 8,14,374 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, రైతులకు గిట్టుబాటు ధర లభించేలా పటిష్టమైన చర్యలు చేపట్టారు. 


గజ్వేల్‌లో సీసీఐదే అగ్రభాగం..

గజ్వేల్‌ పరిధిలో పత్తి విక్రయాలు జనవరి 31 వరకు 21, 432 మంది రైతుల నుంచి నుంచి 172 కోట్ల 45 లక్షల 27 వేల 756 రూపాయల విలువ చేసే 3,17,072 క్వింటాళ్ల పత్తి ని సీసీఐ కొనుగోలు చేసింది. ప్రైవేట్‌ వ్యాపారులు 31,313 మంది నుంచి 1,93,425 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశా రు. గజ్వేల్‌ పరిధిలో 7 జిన్నింగ్‌ మిల్లులు ఉండగా సీసీఐ, స్వంతంగా కలిపి 4,10,497 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశా యి. అత్యధికంగా సాయిబాలాజీ 98,945 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా, రెండో స్థానంలో ఈశ్వర సాయి 92,104 క్వింటాళ్లు, శ్రీవాసవి 86,097 క్వింటాళ్లు, శ్రీనివాస 63,954 క్వింటాళ్లు, శ్రీసర్వేజన 53,214 క్వింటాళ్లు, సప్తగిరి 47,129 క్వింటాళ్లు, విశ్వతేజ 46,109 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. జిన్నింగ్‌ మిల్లులు, సీసీఐ కేంద్రం వివరాలు తెలియక, అన్‌లై న్‌లో వివరాలు ఎంట్రీ కాక.. డబ్బులు నగదు కావాలని చాలామంది రైతులు, ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. తద్యారా క్వింటాల్‌పై రూ.800లకు పైగా నష్టపోతున్నారు. 


సాగు నమోదులో తప్పులు..

జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణ వివరాలను తప్పుగా నమోదు చేయడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు పలువురు రైతులు చెప్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు రైతులను సంప్రదించకుండానే పత్తి సాగు వివరాలను నమోదు చేశారు. వివరాలు తారుమారు కావడంతో  రైతులు తమ పత్తిని విక్రయించడా నికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే, భూమి పట్టా వివ రాలు కూడా సరిపోకపోవడంతో విక్రయించ లేకపోతున్నారు. ముందుగా రైతులు.. మార్కెట్‌ లేదా సీసీఐ కొనుగోలు కేం ద్రాల వద్దకు వచ్చి అన్‌లైన్‌లో తమ భూమి విస్తీర్ణం, పత్తి సాగు వివరాలను సరి చూసుకుంటున్నారు. కాగా, వ్యవసా య అధికారులు రైతుల వివరాలను సవరిస్తూ పత్తి కొనుగోలు కేంద్రాలకు ప్రత్యేక ధ్రువీకరణ పత్రాలను అందజేస్తున్నారు.


logo