ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 01, 2020 , 23:09:15

నెల రోజుల్లో కాళేశ్వరం నీళ్లు

నెల రోజుల్లో కాళేశ్వరం నీళ్లు

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : రైతులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ రికార్డుల ప్రక్షాళణ కా ర్యక్రమం చేపట్టారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నా రు. శనివారం సిద్దిపేటలోని జగ్జీవన్‌రామ్‌ భవన్‌లో నియోజకవర్గ పరిధిలోని 750మంది లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు, 50 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ, ఆర్డీవో అనంతరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డితో కలిసి అందజేశారు. మంత్రి హరీశ్‌రా వు మాట్లాడుతూ పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన వారికి వచ్చే వానకాలం నుంచి రైతుబంధు అందుతుందన్నారు. ప్రతి రైతుకు రూ.5 లక్షల బీమా సౌకర్యం ఉంటుందన్నారు. నెలరోజుల్లో సిద్దిపేటకు కాళేశ్వరం నీళ్లు వస్తాయని మంత్రి తెలిపారు. రైతులు మూస పద్ధతిలో వరి పంట కాకుండా హార్టికల్చర్‌, సంప్రదాయేతర పంటలు పండించి అధిక లాభాలు పొందాలన్నారు. 


24 గంటల కరెంట్‌తో పాటు మంచి భూములు ఉన్నాయని, అధిక ఆదాయం వచ్చే పంటలు పండించాలన్నారు. సిద్దిపేట జిల్లాలో హార్టికల్చర్‌ యూనివర్సిటీ ఉందని, దాని పక్కన 50 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు పండిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు కావాల్సిన సకల సౌకర్యాలు కల్పిస్తున్నదన్నారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాగిరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ పాల సాయిరాం, చిన్నకోడూరు ఎంపీపీ మాణిక్యరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌రెడ్డి, నంగనూరు జడ్పీటీసీ తడిసిన ఉమా, నాయకులు జాప శ్రీకాంత్‌రెడ్డి, అల్లం ఎల్లం, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo