ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 01, 2020 , 00:30:46

హాటు కోడి

హాటు కోడి
  • గ్రామ మహిళా సంఘం ఆధ్వర్యంలో యూనిట్‌
  • ఉపాధి పొందుతున్న చిన్నగుండవెళ్లి మహిళలు
  • కోళ్లఫారాన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
  • ఆదర్శంగా రాజన్న కోళ్ల ఉత్పత్తి దారుల సంఘం

సిద్దిపేట రూరల్‌ : మహిళలు ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యం ఒక వైపు... మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న నాణ్యమైన వస్తువులను ప్రజలకు అందించాలనే తపన మరో వైపు... వెరసి మహిళల స్వశక్తితో, ఆర్థికంగా వృద్ది సాధించే దిశగా ప్రయత్నం. ఇందులో భాగంగా నిన్న ఇర్కోడులో చట్నీల వ్యాపారం ఒకటైతే.. నేడు చిన్నగుండవెళ్లి గ్రామం లో ప్రారంభించిన నాటు కోళ్ల యూనిట్‌ మరో ముందడుగు. అంకాపూర్‌ దేశీ కోళ్లను మరిచే విధంగా చిన్నగుండవెళ్లిలో నాటు కోళ్ల యూనిట్‌ను ప్రారంభించారు.  చిన్నగుండవెళ్లి గ్రామాన్ని నాటుకోళ్ల ఉత్పత్తి కేంద్రంగా మారుద్దామని మంత్రి హరీశ్‌రావు చెప్పినట్టు.. ఆ దిశగా మహిళలు కృషి చేస్తున్నారు. మహిళలకు ఉపాధిని అందించడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవడానికి మంత్రి హరీశ్‌రావు, మండల ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న చొరవపై ప్రత్యేక కథనం.

మాంసం ప్రియులకు తక్కువ ధరకే మంచి నాణ్యమైన మాంసాన్ని అందించడంతోపాటు మహిళలకు ఉపాధి లభించాలనే ఉద్దేశంతో పది మహిళలు రాజన్న కోళ్ల ఉత్పత్తి దారుల సంఘంగా ఏర్పడి నాటు కోళ్ల ఉత్పత్తితోపాటు పెం పకం కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2 నెలల క్రితం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌), జాతీయ మాం సం ఉత్పత్తుల సంస్థ సహకారంతో మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా రెయిన్‌బో రూష్టర్‌ జాతికి చెందిన 500 నాటు కోడి పిల్లలను ఫారంలో వదిలారు. నాటి నుంచి రాజన్న సంఘం మహిళలు వాటిని జాగ్రత్తగా కాపాడుతూ పెంచుతున్నారు. రోజుకు ఉదయం 3 గంటలు, సాయం త్రం 5 గంటలు వాటిని పెరటిలో తిప్పుతూ, దాణా వేస్తూ,  పాత్రలను శుభ్రం చేస్తూ కోళ్లను పెంచుతున్నారు.  


* మార్కెటింగ్‌ సౌకర్యాలు..

మొదటి విడుతలో వేసిన 500 కోళ్లు నిర్ణీత ధరకు విక్రయించారు. మరో 800 కోళ్లు  ఫారంలో వదిలారు. మార్కెటింగ్‌ చేసుకునేందుకు వీలుగా అన్ని రకాల పరికరాలను రాజన్న మహిళా సమాఖ్యకు అధికారులు అందించారు.  స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో నాటుకోళ్ల ఫారాన్ని విస్తరిస్తున్నట్లు మహిళలు చెబుతున్నారు. ప్రజలకు నాణ్యమైన నాటు కోడి మాంసం అందించే ఉద్దేశంతో చేసే ప్రయత్నానికి ప్రజలు సహకరించి, వ్యాపారం జరిగే విధంగా చొరవ చూపాలని మహిళలు కోరుతున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సహకరిస్తున్న మంత్రి హరీశ్‌రావుకు మహిళలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.  

 హరీశ్‌రావు సార్‌కు రుణపడి ఉంటాం..

నాటు కోళ్ల పెంపకం యూ నిట్‌ను మంజూరు చేసి ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు మంత్రి హరీశ్‌రావు సారుకు రుణపడి ఉంటాం. ఎల్లవేళలా సహకరిస్తున్న జ డ్పీటీసీ శ్రీహరిగౌడ్‌, సర్పంచ్‌ రఘోత్తంరెడ్డి, ఉప సర్పంచ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంచి ప్రగతిని సాధిస్తాం. - చందిరెడ్డి శంకరవ్వ  

మాకు మంచి అవకాశం వచ్చింది.

మాకు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశం వచ్చిం ది. అధికారులు చెప్పిన విధం గా నడుస్తూ కోళ్ల ఉత్పత్తిని లా భాల బాటలో నడిపిస్తాం. అధికారుల, ప్రజాప్రతినిధుల సూ చనలు పాటిస్తూ కోళ్లను జాగ్రత్తగా కాపాడి మంచి కోళ్లను ప్రజలకు అందిస్తాం. తక్కువ ప్రజలకు అందించే ప్రయ త్నం చేస్తాం.  - రాజారాంగారి ప్రమీల (చిన్నగుండవెళ్లి)

 ఊర్లోనే ఉపాధి దొరుకుతున్నది 

మా కోళ్ల యూనిట్‌లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దాణా, నీళ్లు పెట్టి కోళ్లను పెం చుతున్నాం.  కోళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుం డా పశు వైద్యాధికారుల సూచ నల మేరకు వాటికి మందులు అందిస్తున్నాం. స్వగ్రామంలో  మాలాంటి మహిళలకు ఉపాధి దొరుకుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.  - మద్దెల పద్మ (చిన్నగుండవెళ్లి)


logo