శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Feb 01, 2020 , 00:19:13

మున్సిపల్‌ పాలకవర్గాలకు శుభాకాంక్షలు

మున్సిపల్‌ పాలకవర్గాలకు శుభాకాంక్షలు

బొల్లారం/ అమీన్‌పూర్‌: నూతనంగా ఎన్నికైన బొల్లారం, అమీన్‌పూర్‌ మున్సిపాలిటీల చైర్మన్‌, వైస్‌చైర్మన్లు, కౌన్సిలర్లు శుక్రవారం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త పాలక వర్గాలకు మంత్రి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మంత్రి హరీశ్‌రావును ఘనంగా సన్మానించారు. 

రైతుబాంధవుడు సీఎం కేసీఆర్‌ 

చిన్నకోడూరు : సీఎం కేసీఆర్‌ రైతుబాంధవుడని.. రైతుబంధు, రైతుబీమా ప్రవేశపెట్టి రైతుల పక్షాన నిలిచారని జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ అన్నారు. చిన్నకోడూరులో ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాముని శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ కొండం రవీందర్‌రెడ్డితో కలిసి మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రోజాశర్మ మాట్లాడారు. చిన్నకోడూరు మండల పరిధిలోని మిర్చి రైతులందరు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి, క్రయవిక్రయాలు నిర్వహించాలని కోరారు. రైతుల సౌకర్యార్థం మండల కేంద్రంలోనే మిర్చి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. రైతులందరూ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్‌ సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మూర్తి బాల్‌రెడ్డి, మండలాధ్యక్షుడు కనకరాజు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఉమేశ్‌చంద్ర, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు శ్రీనివాస్‌, కమిటీ డైరెక్టర్లు, పార్టీ నాయకులు, టీఆర్‌ఎస్వీ నాయకులు భిక్షపతి, టీఆర్‌ఎస్‌వై నాయకులు సుధాకర్‌, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

అనంతసాగర్‌ సరస్వతీ ఆలయంలో పూజలు 

వసంత పంచమిని పురస్కరించుకొని మండలంలోని అనంతసాగర్‌ సరస్వతీ ఆలయంలో రోజాశర్మ-రాధాకృష్ణ శర్మ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు అష్టకాల నరసింహరామశర్మ, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


logo