శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 30, 2020 , 23:38:45

సహకార సమరం

సహకార సమరం
  • ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల
  • ఫిబ్రవరి 3న అన్ని సొసైటీల్లో నోటిఫికేషన్‌
  • 6 నుంచి 8 వరకు నామినేషన్ల స్వీకరణ
  • 10న ఉపసంహరణ, అదేరోజు తుదిజాబితా
  • 15న పోలింగ్‌, వెంటనే లెక్కింపు, ఫలితాలు
  • జిల్లాలో 21 ప్రాథమిక సహకార సంఘాలు
  • ఉమ్మడి రాష్ట్రంలో 2013లో సహకార ఎన్నికలు
  • రెండేండ్ల కిందట ముగిసిన పదవీకాలం
  • మొదలైన సహకార ఎన్నికల కోలాహలం

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలం గాణ : మున్సిపల్‌ ఎన్నికల సమరం ముగియడంతో ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర సహకార ఎన్నికల అధికారి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. ఫిబ్రవరి 3న అన్ని సొసైటీల్లో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. 6వ తేదీ నుంచి 8వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 10వ తేదీ మధ్యాహ్నం వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు కాగా అదేరోజు అభ్యర్థుల తుదిజాబితా ప్రకటించి అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 1 వరకు ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ప్రస్తుతం జిల్లాలో 21 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలున్నాయి. వీటిల్లో జనవరి 2018 మార్చి నాటికి సుమారు 60 వేలమంది సభ్యులున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013 జనవరిలో ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు జరగగా, రెండేండ్ల కిందట పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. వరుసగా శాసనసభ, పార్లమెంట్‌, స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికలు రావడంతో ప్రస్తుత పాలకవర్గాన్ని పర్సన్‌ ఇన్‌చార్జ్‌లుగా కొనసాగిస్తూ ప్రతి ఆర్నెల్లకొకసారి పదవీకాలాన్ని పొడిగిస్తూ వస్తుంది. మున్సిపల్‌ ఎన్నికలు ముగియగానే సహకార ఎన్నికలు రావడంతో జిల్లాలో ఎన్నికల కోలాహలం మొదలైంది. వరుస విజయాలతో జోష్‌లో ఉన్న అధికార టీఆర్‌ఎస్‌..సహకార సంఘాల ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు సమాయత్తమవుతున్నది.  


ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల నగార మోగింది. ఈ మేరకు రాష్ట్ర కో-ఆపరేటివ్‌ ఎన్నికల అధికారి ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశా రు. ఫిబ్రవరి 3న ఆయా సొసైటీల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీక రిస్తారు. జిల్లాలోని 21 ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు జర గనున్నాయి. మున్సిపల్‌ ఎన్నికలు ముగియగానే సహకార ఎన్నికలు రావడంతో జిల్లాలో ఎన్నికల కోలాహలం నెలకొంది.


  జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు ముగియగానే ప్రాథమిక సహకార ఎన్నికలు రావడంతో జిల్లాలో ఎన్నికల కోలా హలం మొదలైంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 21 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా సొసైటీల్లో ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లను స్వీక రిస్తారు. 9వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 10న నామి నేషన్ల ఉపసంహరణకు గడువు అదే రోజు తుది జాబితాను ప్రకటించి అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. 15వ తేదీ న ఉదయం 7 గంటల నుంచి 1 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం మూడు రోజుల్లోపు ఆఫీసు బేరర్స్‌ ఎన్నిక నిర్వహిస్తారు. జిల్లాలో ప్రస్తుతం జనవరి 2018 మార్చి వరకు సుమారు 60 వేల మంది ఉన్నారు. ఈ ఓట ర్ల సంఖ్య స్వల్ప మార్పులు చేర్పులు కూడా అయ్యే అవ కాశాలు ఉన్నాయి. కొన్ని ఓటర్లు పెరగవచ్చు.. లేదా తగ్గ వచ్చు.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాలకు 2013 జనవరిలోఎన్నికలు జరిగాయి. రెండేండ్ల కిందట ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం పూర్తయింది. వరుసగా శాసనసభ, పార్లమెంట్‌, స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికలు రావడంతో ప్రస్తుత పాలకవర్గాన్ని పర్సన్‌ ఇన్‌చార్జ్‌లుగా కొనసాగిస్తూ ప్రతి ఆరు నెలలకొకసారి పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నది. ఇప్పటికే వీరి పదవీకాలన్ని నాలుగు సార్లు పొడగించింది. 


 జిల్లాలో మొత్తం 21 సహకార సంఘాలు 

జిల్లాలోని 21 ప్రాథమిక సహకార సంఘాలలో మార్చి 2018 ప్రకారం సుమారు 60 వేల మంది ఉన్నారు. ఈ ఓటర్ల సంఖ్య డిసెంబర్‌ 2018 వరకు సొసైటీలో నమోదు చేసుకున్న వారి పేర్లు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఓటర్ల సంఖ్య పెరగవచ్చు. 3వ తేదీన ఫైనల్‌ ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తారు. 


జిల్లాలో ఎన్నికల కోలాహలం

జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాయి. పాలక వర్గాలు కొలువు దీరాయి. ఇక ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు నిర్వహిం చడానికి అధికార యంత్రాం గం ఏర్పాట్లు చేస్తున్న నేప థ్యంలో జిల్లాలో ఎన్నికల కోలాహలం మొదలైంది. వరుసగా ఒకదాని తరువాత ఒక ఎన్ని కలు రావడంతో సహకార సంఘాల ఎన్నికలు గత రెండు సంవ త్సరాల నుంచి పర్సన్‌ ఇన్‌చార్జ్‌ల పాలనలో కొనసాగుతున్నాయి. అన్ని ఎన్నికలు ముగియడంతో సహకార సంఘాల ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడింది. దీంతో ఆశావహులంతా సహకార సంఘాల ఎన్నికలపై దృష్టి సారించారు. ఇప్పటికే ప్రతి ఎన్నికల్లో వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ సహకార సంఘాల ఎన్నికల్లో కూడా అన్నింటా విజయం సాధించి మరోమారు సత్తా చాటేందుకు గులాబీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. 


logo