మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 30, 2020 , 23:36:52

17రోజులు.. రూ.73 లక్షలు

17రోజులు.. రూ.73 లక్షలు
  • మల్లన్నకు రికార్డు ఆదాయం
  • 17 రోజుల్లో రూ.73,77,612 రాక
  • ఆలయ చరిత్రలో ఇదే ప్రథమం

చేర్యాల, నమస్తే తెలంగాణ : కొమురవెల్లి మల్లన్న ఆదాయం రోజురోజుకు ఘననీయంగా పెరుగుతున్నది. ఆలయ చరిత్రలో 17 రోజుల్లో రూ. 73 లక్షల ఆదాయం రావడం ఇదే ప్రథమం. హుండీలో కాసుల వర్షం కురుస్తుండడంతో ఆలయ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల అధికారులు, పునరుద్ధరణ కమిటీ చేపడుతున్న కార్యక్రమాలతో ఆదాయం పెరుగుతున్నది. మల్లికార్జున స్వామి ఆలయ హుండీలను మహా మం డపంలో ఈవో వెంకటేశ్‌, ఉమ్మడి జిల్లా ఏసీ హేమంత్‌కుమార్‌, దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ రంగరావు పర్యవేక్షణలో గు రువారం లెక్కింపులు జరిగాయి. ఆల య సిబ్బంది, అర్చకులు, రాజ న్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివశక్తి భజ న మండలి భక్తులు 200 మంది లెక్కింపులు జరిపారు.


జనవరి 13న చేసిన లెక్కింపుల్లో రూ. 58, 81,980 రాగా, ఇప్పుడు జరిపిన లెక్కింపులో రూ.73, 77,617  వచ్చాయి. నగదుతోపాటు 1000 కిలోల బియ్యం, 25 విదేశి కరెన్సీ, అలాగే, రూ.37 వేలు చెల్లని నోట్లు లభించాయి. ఈ సందర్భంగా ఈవో  మాట్లాడుతూ మల్లన్న ఆలయంలోని 14 హుండీల ద్వారా లభించిన నగదును స్ధానిక ఏపీజీవీబీలో జమ చేశామన్నారు. కార్యక్రమంలో ఏఈవో రావుల సుదర్శన్‌, పర్యవేక్షకుడు నీల శేఖర్‌, కమిటీ సభ్యులు ముత్యం నర్సింహులు, ఉట్కూరి అమర్‌, మంతెన బాల్‌రెడ్డి, బొంగు నాగిరెడ్డి, ఏగుర్ల మల్లయ్య, యావజుల ఐలయ్య, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.  


నిబంధనలు పాటించని ఆలయ అధికారులు

హుండీ లెక్కింపు సందర్భంగా నిబంధనలు పాటించాల్సిన అధికారులు వాటిని పట్టించుకోలేదు. హుండీ లెక్కింపు పర్యవేక్షణ కోసం విధులకు వచ్చిన ఉమ్మడి జిల్లా ఏసీ హేమంత్‌కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ రంగారావు డ్రెస్‌కోడ్‌ పాటించ లేదు. దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌ ఆదేశాలతో హుండీ లెక్కింపుల సం దర్భంగా పర్యవేక్షణ అధికారులతోపాటు ఆలయ అధికారులు పంచె, కం డువా ధరించాలి. కానీ, అధికారులు ప్యాంట్‌, షర్ట్‌ ధరించి, విధులు నిర్వహించడంపై భక్తులు మండిపడుతున్నారు. 


logo