ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 30, 2020 , 23:34:44

క్రీడల్లో రాణించాలి

క్రీడల్లో రాణించాలి

సంగారెడ్డి చౌరస్తా : చదువుతో విద్యార్థులు క్రీడల్లో రాణించాలని సంగారెడ్డి డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. రెండు రోజుల క్లస్టర్‌ స్థాయి (ఉమ్మడి మెదక్‌ జిల్లా) యువతరంగం క్రీడల్లో భాగంగా స్థానిక తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్‌ కళాశాలలో గురువారం మహిళలకు పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి.. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రముఖర్జీతో కలిసి జ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక క్రీడాకారులు వివిధ క్రీడల్లో రాణించిన  జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకోని రాణించాలన్నారు. క్రీడలు శారీరక ఎదుగుదలకు  దోహదం చేస్తాయని, దీంతో మానసిక దృఢత్వం ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తీసుకోవాలని, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని, విధిగా హెల్మెట్‌ ధరించి, వాహనాలను నడుపాలని. అప్పుడే ప్రమాదాలను నివారించగలమన్నారు.  


విజయం కోసం శ్రమించాలి.. 

 ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రముఖర్జీ మాట్లాడుతూ.. యువతరంగం క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులందరూ విజయం కోసం శ్రమించాలని, గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 14 కళాశాలల విద్యార్థులు పాల్గొంటున్న ఈ పోటీల్లో ఈ నెల 31న బాలుర క్రీడలను కలెక్టర్‌ హనుమంతరావు ప్రారంభిస్తారని వివరించారు. అనంతరం బాల్‌ సర్వీస్‌ చేసి వాలీబాల్‌ పోటీలను ప్రారంభించారు. 


ఉత్సాహంగా  క్రీడా పోటీలు..

యువతరంగం పోటీలు తారా కళాశాల ఆవరణలో జోరుగా కొనసాగాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్‌, షాట్‌ఫుట్‌, చెస్‌, పరుగుపందెం వంటి పోటీల్లో క్రీడాకారులు  సత్తా చాటారు. మొదటి రోజు జరిగిన మహిళా విభాగం క్రీడల విజేతల వివరాలు.. ఖోఖోలో గజ్వేల్‌ మహిళా కళాశాల జట్టు మొదటి స్థానం, సిద్దిపేట జీడీసీ రెండో స్థానం, వాలీబాల్‌లోనూ గజ్వేల్‌ మహిళా కళాశాల జట్టు మొదటి స్థానం, తారా కళాశాల ద్వితీయ స్థానంతో సరిపెట్టుకున్నది. కబడ్డీలో సిద్దిపేట అటానమస్‌ కళాశాల జట్టు మొదటి స్థానం, గజ్వేల్‌ జట్టు రెండో స్థానంలో నిలిచాయి. 100 మీటర్ల పరుగు పందెంలో సిద్దిపేట జీడీసీడబ్ల్యూ విద్యార్థిని శివాంజలి మొదటి స్థానం, గజ్వేల్‌ జీడీసీడబ్ల్యూ విద్యార్థిని ఇందిర ద్వితీయ స్థానంలో నిలిచారు. 200 మీటర్ల పరుగు పందెం లో మెదక్‌ జీడీసీ విద్యార్థిని సునీత ప్రథమ స్థానం, జహీరాబాద్‌ జీడీసీ విద్యార్థిని జయశ్రీ ద్వితీయ స్థానం లో నిలిచారు. 400  మీటర్ల పరుగు పందెంలో మెదక్‌ జీడీసీ విద్యార్థిని మమత ప్రథమ స్థానం, సంగారెడ్డి జీడీసీడబ్ల్యూ విద్యార్థిని భారతి ద్వితీయ స్థానంలో నిలిచారు. 


800 మీటర్ల పరుగు పందెంలో గజ్వేల్‌ జీడీసీడబ్ల్యూ విద్యార్థిని స్వరూప ప్రథమ స్థానం, పటాన్‌చెరు జీడీసీ విద్యార్థిని వాణి ద్వితీయ స్థా నంలో నిలిచారు. లాంగ్‌జంప్‌లో గజ్వేల్‌ జీడీసీడబ్ల్యూ విద్యార్థిని మౌనిక ప్రథమ స్థానంలో ఉం డగా, సిద్దిపేట జీడీసీడబ్ల్యూ విద్యార్థిని నిఖిత రెండో స్థా నం, షాట్‌ఫుట్‌లో గజ్వేల్‌ జీడీసీడబ్ల్యూ  విద్యార్థిని అశ్వి ని ప్రథమ స్థానం, సంగారెడ్డి జీడీసీడబ్ల్యూ విద్యార్థిని అసిఫియా ఫాతిమా ద్వితీయ స్థానంలో రాణించారు. అనంతరం ప్రిన్సిపాల్‌ విజేతలకు మెమొంటో, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో యువతరంగం క్లస్టర్‌ స్థాయి ఇన్‌చార్జిలు షరీఫ్‌మియా, నాగరా జు, న్యాయనిర్ణేతలు, ఉమ్మడి జిల్లాలోని కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు. 


logo