శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 29, 2020 , 23:41:10

పల్లెలకు నిధుల వెల్లువ

పల్లెలకు నిధుల వెల్లువ
  • - ప్రతినెలా జనాభాకనుగుణంగా నిధులు మంజూరు
  • - 14వ ఆర్థిక సంఘం, స్టేట్‌ ఫైనాన్స్‌ నుంచి విడుదల
  • - ఐదు నెలల్లో రూ.73.42 కోట్లు రాక
  • - పల్లెప్రగతి పనులకు పుష్కలంగా నిధులు
  • - ప్రతి నెల పంచాయతీలకు రూ.13.27 కోట్లు
  • - నిధులు వస్తుండడంతో చురుగ్గా అభివృద్ధి పనులు
  • - పల్లెప్రగతిలో రాష్ట్రంలోనే జిల్లా ముందంజ
  • - జోరుగా వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల నిర్మాణం
  • - ఇప్పటికే గ్రామానికొకటి చొప్పున ట్రాక్టర్‌ అందజేత


సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామముగా, సమస్యల్లేని పల్లెలుగా  తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్న టీఆర్‌ఎస్‌ సర్కారు అందుకనుగుణంగా దండిగా నిధులు మంజూరు చేస్తున్నది. ప్రతి పనిని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తుండడంతో అభివృద్ధి జరుగుతున్నది. పరిశుభ్ర పల్లెలుగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన పల్లెప్రగతి పనులు సత్ఫలితాలిస్తున్నాయి. ఈ పనుల కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు రూ.339 కోట్లను ప్రభుత్వం ప్రతినెలా మంజూరు చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతినెలా రూ.13.27 కోట్లు పంచాయతీలకు చేరుతున్నాయి. సెప్టెంబర్‌ నుంచి జనవరి వరకు ఐదునెలల కాలంలో రూ.73.42 కోట్లు విడుదలయ్యాయి. ప్రతి గ్రామంలో ఉన్న జనాభాక నుగుణంగా 14వ ఆర్థిక సంఘం, స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులు ఏ నెలకానెల మంజూరవుతుండడంతో అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ప్రధానంగా వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి గ్రామానికి చెత్త తరలించేందుకు ట్రాక్టర్‌ను అందజేశారు. జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు  ఉన్నాయి. పల్లెప్రగతి ప్రణాళిక పనుల్లో రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా ముందుస్థానంలో ఉన్నది. నిత్యం ఆయా పంచా యతీల పరిధిలో శ్రమదానాలు, పారిశుద్ధ్యం, డ్రైడేలు తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.  


పంచాయతీలకు నిధుల వరద పారుతుంది. నెలనెలా పంచాయతీలకు నిధు లు వస్తుండడంతో ప్రణాళికబద్ధంగా గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. ఈ ఐదు నెలల కాలంలో రూ.73.42 కోట్లు విడుదలయ్యాయి. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి పంచాయతీకి ఆ గ్రామ జనాభాకు అనుగుణంగా నిధు లు విడుదలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులన్నీ జిల్లాలో విజయవంతంగా పూర్తి చేశారు. నేడు గ్రామాలన్నీ అద్దంలా మారుతున్నాయి. 


జిల్లాలో 499 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలకు ఆయా జనాభాకు అనుగుణంగా 14వ ఆర్థిక సంఘం, స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులు నెలనెలా మంజూరవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా పంచాయతీలకు రూ.339 కోట్లు ప్రభుత్వం విడుదల చేస్తుంది. జిల్లాకు ప్రతి నెలా రూ.13.27 కోట్ల నిధులు గ్రామ పంచాయతీలకు వస్తున్నాయి. సెప్టెంబర్‌ మాసంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.94 కోట్లు, స్టేట్‌ ఫైనాన్స్‌ నిధులు రూ.5.32 కోట్లు అక్టోబర్‌ మాసంలో 14వ ఆర్థిక సం ఘం నిధులు రూ.7.89 కోట్లు, స్టేట్‌ ఫైనాన్స్‌ రూ.5.28 కోట్లు, 2017 -18 ఫర్ఫామెన్స్‌ గ్రాంట్‌ కింద రూ. 8.41 కోట్లు విడుదలయ్యాయి. నవంబర్‌లో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.12.43 కోట్లు, స్టేట్‌ ఫైనాన్స్‌ రూ.7.52 కోట్లు, డిసెంబర్‌లో స్టేట్‌ ఫైనాన్స్‌ కమీషన్‌ నుంచి రూ.10.57 కోట్లు, స్టేట్‌ ఫైనాన్స్‌ కమీషన్‌ (ఎస్‌సీఎస్‌పీ) రూ.17.51 కోట్లు, స్టేట్‌ ఫైనాన్స్‌ కమీషన్‌ (టీఎస్‌పీ) రూ.19.27 కోట్లు నిధు లు జిల్లాలోని పంచాయతీలకు విడుదలయ్యాయి. 


జనవరి మాసంలో 14వ ఆర్థిక సంఘం నుంచి రూ.7.89 కోట్లు, స్టేట్‌ ఫైనాన్స్‌ కమీషన్‌ నుంచి రూ.3.98 కోట్లు, స్టేట్‌ ఫైనాన్స్‌ కమీషన్‌ (ఎస్‌సీఎస్‌పీ) గాను రూ. 8.77 కోట్లు, స్టేట్‌ ఫైనాన్స్‌ కమీషన్‌ (టీఎస్‌పీ) రూ.9.61 కోట్లు మొత్తం ఐదు మాసాల్లో జిల్లాకు రూ.73.42 కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా పల్లె ప్రగతి కార్యక్రమంలో ముందంజలో ఉంది. 30 రోజుల ప్రణాళికలో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని జనవరిలో 11 రోజుల పాటు రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో శ్రమదానాలు, పారిశుద్ధ్యం, డ్రైడేలు తదితర కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డు నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. అన్ని గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరాయలని ప్రణాళికబద్ధంగా గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది.  


logo