శనివారం 19 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 29, 2020 , 23:38:34

కంచుకోటలో కారు ప్రభంజనం

కంచుకోటలో కారు ప్రభంజనం

గజ్వేల్‌, నమస్తే తెలంగాణ: గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి 49 శాతం ఓటర్ల మద్దతు లభించింది. కాంగ్రెస్‌, బీజేపీకి 16 శాతం ఓట్లు దక్కడం గమనార్హం. స్వతంత్ర అభ్యర్థులకు 35.8 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 24858 ఓట్లలో టీఆర్‌ఎస్‌కు 12213 ఓట్లతో 49 శాతం, కాంగ్రెస్‌కు 2621 ఓట్లతో 10.5 శాతం, బీజేపీకి 664 ఓట్లతో 5.4 శాతం, స్వతంత్రులకు 8892 ఓట్లతో 35.8 శాతం నమోదైంది. 


కాంగ్రెస్‌ అభ్యర్థికి 2 ఓట్లే ...

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు మున్సిపల్‌ ఎన్నికల్లో పరాభవంతో పాటు అత్యల్ప ఓట్లు పొందిన అభ్యర్థులుగా నిలిచారు. 14 వార్డుల్లో రెండంకెల ఓట్లు పొందగా 3 వార్డుల్లో ఒకే అంకె ఓట్లను పొందడం ఆ పార్టీ పరువుతీసినట్లు అయింది. 11వ వార్డు అభ్యర్థి ఉమారాణికి 2 ఓట్లు రావడం గమనార్హం. 15వ వార్డు అభ్యర్థి బి. సుధాకర్‌కు 6 ఓట్లు రగా, 3వ వార్డు అభ్యర్థి పి. అనితకు 7 ఓట్లు వచ్చాయి. ఇంకా 10వ వార్డు అభ్యర్థికి 10 ఓట్లు, 4వ వార్డు అభ్యర్థికి 14 ఓట్లు, 18వ వార్డు అభ్యర్థికి 17 ఓట్లు, 10వ వార్డు అభ్యర్థికి 18 ఓట్లు, 6వ వార్డు అభ్యర్థికి 20 ఓట్లు, 9వ వార్డు అభ్యర్థికి 21 ఓట్లు వచ్చాయి. 


బీజేపీది ఇదే స్థితి...

బీజేపీ అభ్యర్థులు కూడా తమ వార్డు ఓటర్లలో ప్రభావం చూపలేకపోయారు.17వ వార్డు అభ్యర్థి యశోద 12 ఓట్లు పొందగా, 5వ వార్డు అభ్యర్థి 15 ఓట్లు పొందగా, 2వ వార్డు అభ్యర్థి 16 ఓట్లు, 13వ వార్డు అభ్యర్థి 29 ఓట్లు పొందారు. 


గజ్వేల్‌లో అత్యధిక మెజార్టీ  ... 

గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌లో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించిన వార్డు సభ్యులుగా కూరకుల శ్రీనివాస్‌ నిలిచారు. 7వ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూరాకుల శ్రీనివాస్‌ తమ సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి కె. రవిపై 826 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు. 19వ వార్డు అభ్యర్థి గుటుంకు శీరిష 822 ఓట్ల అధిక్యంతో 2వ స్థానంలో నిలిచారు. 


అత్యల్ప మెజార్టీ...

8వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జకీయుద్దిన్‌ 16 ఓట్ల అధిక్యంతో కాంగ్రెస్‌  అభ్యర్థి నాయిని యాదగిరిపై విజయం సాధించారు. 13వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థి షేక్‌ షాహనజ్‌ 26 ఓట్ల అధిక్యంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై గెలుపొందారు. 91 ఓట్ల అధిక్యంతో స్వతంత్ర అభ్యర్థి 9వ వార్డులో విజయం సాధించారు.


పలువురు మాజీలకు చుక్కెదురు..

మాజీ కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దుంబాల అరుణ, స్వతంత్ర అభ్యర్థిగా నక్కశశికళ ఓటమికి గురికాగా మాజీ కౌన్సిలర్‌ గజ్వేల్‌ నర్సింలు స్థానంలో ఆయన భార్య పూలమ్మ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మాజీ కౌన్సిలర్‌ స్థానంలో 10వ వార్డులో ఆమె భర్త ఎఆర్‌ చారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి పరాభవం పొందారు. 


ఒకరి స్థానంలో మరొకరు...

12వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వంటేరు నారాయణ రెడ్డి మాజీ కౌన్సిలర్‌ ఆయన భార్య బుచ్చమ్మ స్థానంలో పోటీ చేసి గెలుపొందారు. 14వ వార్డులో అల్వాల మాధవి స్థానంలో ఆమె భర్త బాలేశ్‌ పోటీ చేసి గెలుపొందారు. 8వ వార్డులో జకీయుద్దిన్‌ మాజీ కౌన్సిలర్‌ ఆయన తల్లి స్థానంలో పోటీ చేసి 16 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి నాయిని యాదగిరిపై విజయం సాధించారు. 


చెల్లని ఓట్లు 290

గజ్వేల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 20 వార్డుల్లో 290 ఓట్లు చెల్లకుండా పోయాయి. అత్యధికంగా 8,19వ వార్డుల్లో 27 ఓట్ల చొప్పున చెల్లకుండా పోగా, 7వ వార్డులో 24 ఓట్లు, 17వ వార్డులో 20 ఓట్లు చెల్లకుండా పోయాయి. అత్యల్పంగా 6వ వార్డులో 5 ఓట్లు, 18వ వార్డులో 7 ఓట్లు, 3,13 వార్డుల్లో 9 ఓట్ల చొప్పున పనికిరాకుండా పోయాయి. 


నోటాకు 182 ఓట్లు

నోటాకు 19వ వార్డులో 43 మంది ఓట్లు వేయడం గమనార్హం. ఈ వార్డులోనే అత్యధికంగా నోటాకు ఓట్లు వేశారు. 1,7వ వార్డుల్లో 21మంది, 12,13వ వార్డుల్లో 15 మంది చొప్పున నోటాకు ఓటు వేశారు. 5వ వార్డులో నోటాకు ఒక్క ఓటు కూడా రాకపోగా అత్యల్పంగా 8,9,11 వార్డుల్లో ఒక్కక్క ఓటు చొప్పున పోలైంది. 


logo