గురువారం 24 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 29, 2020 , 23:32:42

ఎకరానికి రూ.4 లక్షలు

ఎకరానికి రూ.4 లక్షలు

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : నిరుపేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థికంగా ఆదుకోవడానికి సీఎం కేసీఆర్‌.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం ద్వారా లక్షా 116 రూపాయలను అందిస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొ న్నారు. జిల్లా కేంద్రం సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు.  


ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రతి ఆడ బిడ్డకు 18 ఏండ్లు నిండిన తరువాతనే పెండ్లి చేయాలని సూచించారు.  నిరుపేదల పెళ్లిళ్లకు ప్రభుత్వం రూ. లక్షా 116లు అందజేస్తుందన్నారు. దేశంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం లేదన్నారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని 74 మందికి రూ.74,08,544 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో సుమారు 2 వేల మంది అర్హులకు కల్యాణలక్ష్మి చెక్కులు రావాలని.. ఎందుకు జాప్యం జరుగుతుందని? తహసీల్దార్లు, ఆర్డీవో కార్యాలయ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. మండలాల వారీగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ చేయడానికి ఎంత సమయం కావాలని అధికారులను మందలించారు. కార్యక్రమంలో డీఆర్‌వో చంద్రశేఖర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, రూరల్‌ మండల జడ్పీటీసీ శ్రీహరిగౌడ్‌, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


 ఆపదలో సీఎం సహాయనిధి భరోసా 

ఆపద సమయంలో నిరుపేదల వైద్యానికి సీఎం సహాయనిధి భరోసాగా నిలుస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని తన నివాసంలో 47 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సిద్దిపేట అర్బన్‌ మండలంలో నలుగురికి రూ.75వేలు, రూరల్‌ మండలంలో 11 మందికి రూ. 3.42 లక్షలు, నారాయణరావుపేట మండలంలో 8 మందికి రూ.2.48 లక్షలు, నంగునూరు మండలంలో నలుగురికి రూ.1.35 లక్షలు, చిన్నకోడూరు మండలంలో 20 మందికి రూ.5.90 లక్షలు మంజూరయ్యాయన్నారు. మొత్తం 47 మందికి రూ.13,10,000 చెక్కులు అందజేశారు. సీఎం సహాయనిధి చెక్కుల అందజేతలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలాంటి తారతమ్యం లేకుండా అర్హులైన ప్రతి  ఒక్కరికి అందిస్తుందన్నారు. లబ్ధిదారులు వెంటనే చెక్కులను బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని సూచించారు. 


విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి

సిద్దిపేట అర్బన్‌ : విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి ఆదర్శంగా నిలువాలని.. వినటం కంటే వీక్షణంతో విద్యను త్వర గా నేర్చుకోవచ్చని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని రంగధాంపల్లిలో ప్రభుత్వ మండల పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఐటీసీ - నెక్ట్స్‌ ఎడ్యుకేషన్‌టీమ్‌, బాల వికాస సంస్థ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన టచ్‌ స్క్రీన్‌ డిజిటల్‌ క్లాస్‌రూమ్‌ ప్రారంభించారు. రంగధాంపల్లి విద్యార్థులు జిల్లాలో ఉత్తమ ఫలితాలు సా ధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, కౌన్సిలర్‌ ఉమారాణి, సుడా డైరెక్టర్‌ ముత్యాల కనకయ్య, నేతలు తిరుమల్‌రెడ్డి, రంగయ్య, ఐలయ్య, ప్రధానోపాధ్యాయుడు రాంప్రసాద్‌ పాల్గొన్నారు. 


 గురుకుల పాఠశాలలో స్వెటర్ల్ల పంపిణీ 

సిద్దిపేట అర్బన్‌ : గురుకుల పాఠశాల విద్యార్థులు బాగా చదివి పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని  మంత్రి పిలుపునిచ్చారు. మిట్టపల్లి గురుకుల పాఠశాలలో విద్యా ర్థులకు బుధవారం రాత్రి స్వెటర్లు పంపిణీ చేశారు. విద్యార్థులను పలు విషయాలపై ప్రశ్నలు అడిగి  వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మిట్టపల్లి గురుకుల పాఠశాల ఉత్తీర్ణతలో వెనుకబడిందని.. ఈసారి ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రిన్సిపాల్‌, సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి నిత్యం యోగా చేయాల న్నారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, ఆర్‌సీవో నిర్మల, ప్రిన్సిపాల్‌ లక్ష్మాంజలి, జడ్పీటీసీ ప్రవళిక, ఎల్లుపల్లి సర్పంచ్‌ జయశ్రీ, నేతలు ప్రవీణ్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ఎల్లం ఉన్నారు.


సిద్దిపేటలోని బాలికల, బాలుర మైనార్టీ గురుకుల పాఠశాలల్లో  స్వెటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో  మంత్రి కాసేపు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారి జీవరత్నం, అధ్యాపకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


మల్బరీ సాగుతో లాభాలు

కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : తక్కువ నీటితోపాటు తక్కు వ పెట్టుబడితో పండే మల్బరీని సాగు చేస్తే రైతులు అధిక ప్ర యోజనాలతోపాటు లాభాలు పొందవచ్చని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కలెక్టరేట్‌లో డీఆర్‌వో చంద్రశేఖర్‌, హార్టికల్చర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రామలక్ష్మి, అధికారులు, ఏపీవోతో పట్టు పరిశ్రమ ఎదుగుదల, మల్బరీ సాగుపై సమీక్షించారు. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మల్బరీ సాగుకు  ఏడాదికి రూ.36 వేలు, షెడ్డు నిర్మాణానికి లక్ష రూపాయలు ఇవ్వాలని ఏపీవోలను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా  87 ప్రతిపాదనలు వచ్చాయని డీఆర్‌డీఏ అధికారు వివరించారు. మల్బరీ తోటలు, పట్టుగూళ్ల ఉత్పత్తిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఒక ఎకరం మల్బరీ సాగుతో ఏడాది పొడవునా ఐదుగురికి ఉపాధి కల్పించవచ్చన్నారు. ఏడాదిలో 8 నుంచి 10 పంటలు సాగు చేసి, ఎకరానికి  రూ.4 లక్షల వస్తుందన్నారు. షెడ్ల నిర్మాణానికి ఉపాధి పథకంలో 70 శాతం, ఉద్యానవన శాఖ 30 శాతం సబ్సిడీ వస్తుందని వివరించారు. అలాగే, ఉపాధి హామీ లేబర్‌ కాంపొనెంట్‌, ఆర్‌అండ్‌బీ రోడ్లు, జిల్లా దవాఖాన మరమ్మతులు చర్చించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌, మున్సిపల్‌ చైర్మన్‌, ఆర్‌అండ్‌బీ డీఈ రవి, జిల్లా దవాఖాన డీఈ విశ్వప్రసాద్‌ ఉన్నారు. 


logo