శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 29, 2020 , 02:40:57

రైతుబంధు డబ్బులొచ్చాయి..

రైతుబంధు డబ్బులొచ్చాయి..
  • - తొలి విడుతగా రూ.15.31 కోట్లు
  • - జిల్లాలో 49,978 మంది రైతుల ఖాతాలోకి..
  • - విడుతల వారీగా నేరుగా రైతుల ఖాతాలో జమ..
  • - హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాత

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాసంగి పంట సాగు పెట్టుబడి సాయం డబ్బులొచ్చాయి. తొలి విడుతగా జిల్లాలో 49,978 మంది రైతుల ఖాతాలో రూ.15.31 కోట్లు నేడో, రేపో జమ కానున్నాయి. విడుతల వారీగా రైతులకు వారం పది రోజుల్లో పూర్తిగా పడనున్నాయి. రంగారెడ్డి ట్రెజరీ నుంచి నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ కానున్నట్లు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. విడుతల వారీగా జిల్లాలోని అందరి రైతులకు రైతుబంధు డబ్బులు జమ కానుండడంతో జిల్లా వ్యాప్తంగా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. రైతులకు అండగా నిలువాలనే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘రైతుబంధు’ పథకాన్ని అమలు చేస్తున్నది. 


యాసంగి పంట సాగు పెట్టుబడి సాయం డబ్బులొచ్చాయి. తొలి విడుతగా జిల్లాలో 49,978 మంది రైతుల ఖాతాలో రూ.15.31 కోట్లు నేడు-రేపు జమ కానున్నాయి. రంగారెడ్డి ట్రెజరీ నుంచి నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ కానున్నట్లు వ్యవసాయ శాఖ జిల్లా అధికారి శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. విడుతల వారిగా జిల్లాలోని అందరి రైతులకు రైతుబంధు డబ్బులు జమ కానుండడంతో జిల్లా వ్యాప్తంగా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.  యాసంగి పంట పెట్టుబడి సాయం డబ్బులు నేటి నుంచి రైతుల ఖాతాలో జమవుతున్నాయి. జిల్లాలో యాసంగి పంట పెట్టుబడి కింద 2,21,034 మంది రైతులు ఉన్నారు. ఇందుకు గాను రూ.259,60,32,819 రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఇట్టి డబ్బులను విడుతల వారీగా రైతుల ఖాతాలో నేరుగా రంగారెడ్డి ట్రెజరీ నుంచి వేస్తారు. తొలి విడుతగా 49,978 మంది రైతులకు గాను రూ.15,31,81,008 డబ్బులు నేడు-రేపు రైతుల ఖాతాలో జమ కానున్నాయి.  మే 2018 లో సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. పథకం ప్రారంభంలో ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు గాను ఏడాదికి రూ.8 వేలను అందించారు. గత శాసన సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.10 వేలను అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం గత వానకాలంలో ఎకరాకు రూ.5 వేల చొప్పున 2,59,207 మంది రైతులకు గాను రూ.304 కోట్లు మంజూరు చేసి నేరుగా రైతుల ఖాతాలోనే జమ చేశారు. యాసంగి సాగు పంటకు గాను 2,21,034 మందిని గుర్తించారు. వీరికి గాను రూ.259 కోట్లను మంజూరు చేసింది. సబ్సిడీపై యంత్రాలు, ఎరువులు, విత్తనాలు అందించడమే కాకుండా రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి రైతాంగానికి గిట్టుబాటు ధరను కల్పించింది. రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో దళారుల బెడద తప్పి రైతులకు గిట్టుబాటు ధర లభించింది. 


తొలి విడుతగా రూ.15.31 కోట్లు.. 

జిల్లాలో యాసంగి పంట సాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం రైతుబంధు డబ్బులను మంజూరు చేసింది. జిల్లాలో 2.21 లక్షల మంది రైతులకు గాను తొలి విడుతలో 49,978 మంది రైతులకు రూ.15.31 కోట్లు రంగారెడ్డి ట్రెజరీ నుంచి నేరుగా రైతుల ఖాతాలో జమ కానున్నాయి. రైతుబంధు పథకం డబ్బులు విడుతల వారిగా అందరి రైతులకు వారం పది రోజుల్లో పూర్తిగా పడనున్నాయి. 

- శ్రావణ్‌కుమార్‌ (జిల్లా వ్యవసాయ శాఖ అధికారి) logo