ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 29, 2020 , 02:36:10

ప్రగతి పరిశీలన

ప్రగతి పరిశీలన
  • - జిల్లాలో రాష్ట్రస్థాయి అధికారుల పర్యటన
  • - మిరుదొడ్డి మండలంలో సీఎం కార్యదర్శి సుల్తానియా..
  • - ములుగు మండలంలో రోడ్స్‌ అండ్‌ రైల్వే సెక్యూరిటీ అడిషనల్‌ డిజీపీ..
  • - రాయపోల్‌ మండలంలో ఫ్లయింగ్‌ స్కాడ్‌ శైలజా రామయ్యర్‌..


మిరుదొడ్డి : రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల బాగు కోసమే రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పథకాన్ని అమలు చేస్తుందని సీఎంవో కార్యదర్శి, సీనియర్‌ ఐఏఎస్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా పేర్కొన్నారు. పల్లె ప్రగతి పనుల పరిశీలనలో భాగంగా మంగళవారం మిరుదొడ్డి మండలంలోని ధర్మారం, మోతె గ్రామాలను ఆకస్మికంగా సందర్శించి, పనులను తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఇరు గ్రామాల్లో నిర్మిస్తున్న డంపింగ్‌ యారులు, శ్మశానవాటికల నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో ఎందుకు జాప్యం జరుగుతున్నదని? అధికారులను ప్రశ్నించారు. హరితహారం పథకంలో నాటిన మొక్కలు ఎం దుకు ఎండిపోతున్నాయని? ఉపాధి హామీ పథకం అధికారులను ప్రశ్నించారు. నాటిన ప్రతి మొక్క ఎండి పోకుండా తగు జాగ్రత్తలు తీసుకొని, ట్రీ గార్డులను అమర్చి, నీళ్లు పోసి, సం రక్షించాలని సూచించారు. మోతెలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను చూసి సుల్తానియా సంతృప్తి వ్యక్తం చేశారు.


వివిధ అంశాలు, అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంవో కార్య దర్శి సూల్తానియా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి పథకాన్ని అధికారులు సమర్థ వంతంగా అమలు చేయాలని సూచించారు. దాతల సహకారంతో అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికా రులతోపాటు ప్రజాప్రతినిధులను కోరారు. పల్లె ప్రగతిలో  ప్రజలకు అన్ని సౌకర్యాలను కల్పించి సంక్షేమ పథకాలు అం దేలా కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో పరిసరాల పరి శుభ్రత పనులను నిరంతరం చేపట్టాలని ఆదేశించారు. ఆరో గ్యవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. పల్లె ప్రగతి పనులను గ్రామాల్లో నిరంతరం.. నిత్యం చేపట్టాలని సూచిం చారు. కార్యక్రమంలో ట్రైనీ ఐఏఎస్‌ ముజామల్‌ఖాన్‌, ఎంపీపీ గజ్జెల సాయిలు, జడ్పీటీసీ సూకురి లక్ష్మి, సర్పంచ్‌లు గూళ్ల పుష్ప, కాలేరు శ్రీనివాస్‌, ఎంపీటీసీలు కీసరి రాజవ్వ, చెప్యాల శ్రీనివాస్‌, ఈజీఎస్‌ ఏపీవో శైలేజ పాల్గొన్నారు.


పల్లె ప్రగతి పనులు బాగున్నాయి..

- అడిషనల్‌ డీజీపీ సందీప్‌ శాండిల్య

ములుగు : హరితహారం, పల్లెప్రగతి కార్యక్రమాల్లో భాగం గా నాటిన మొక్కలను కాపాడేందుకు చేపట్టిన సంరక్షణ చర్య లు బాగున్నాయని రోడ్స్‌ అండ్‌ రైల్వేస్‌ సెక్యూరిటీ అడిషనల్‌ డీజీపీ సందీప్‌ శాండిల్య కితాబునిచ్చారు. ములుగు మండలంలోని లక్ష్మక్కపల్లి, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతి పనులను స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలను సందర్శించి, వాటి నిర్వాహణ, వినియోగ పద్ధతులను పరిశీలించారు. అలాగే, హరితహారంలో భాగం గా నిర్వహిస్తున్న నర్సరీలను పరిశీలించి, అక్కడ పెంచుతున్న మొక్కల రకాలను గురించి అడిగి తెలుసుకున్నారు. మొక్కల సంరక్షణకు అధికారులు, ప్రజాప్రతినిధులు చేపడుతున్న సం రక్షణ చర్యలు బాగున్నాయని అభినందించారు. డంపింగ్‌ యార్డుల నిర్వహణ, తడి, పొడి చెత్త సేకరణ తదితర అంశాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. పవర్‌వీక్‌ లో చేపట్టిన పనులు, స్తంభాలు, విద్యుత్‌ మీటర్ల ఏర్పాట్లపై ఆరా తీశారు. మొదటి, రెండో విడుత పల్లె ప్రగతి కార్యక్రమా ల్లో భాగంగా చేపట్టిన పనుల గురించి గ్రామస్తులను స్వయం గా అడిగి తెసుకున్నారు. 2వ విడుత 10 రోజుల పల్లె ప్రగతి పనులు విజయవంతం చేసినందుకు సంతోషం వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ పెద్దబాల్‌ లావణ్యాఅంజన్‌గౌడ్‌, ఎస్‌ఐ రాజేంద్రప్రసాద్‌, ఈవోపీఆర్డీ సౌజన్య, ఏపీవో సురేందర్‌, సర్పంచ్‌లు వెంకట్‌రెడ్డి, బాల్‌నర్సింలు, గ్రామ కార్యదర్శులు శోభ, రోజా పాల్గొన్నారు. 


చిన్నారులకు పౌష్టికాహారం ఇవ్వాలి

- ఫ్ల్లయింగ్‌ స్కాడ్‌ శైలజా రామయ్యర్‌ 

రాయపోల్‌ : మండలంలోని టేంకంపేట గ్రామంలో పల్లెప్రగతి పనులను ఫ్ల్లయింగ్‌ స్కాడ్‌ శైలజా రామయ్యర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టిన శ్మశాన వాటిక, డంపింగ్‌యార్డు, నర్సరీ, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, హరితహారం మొక్కలు, ట్రీగార్డుల ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామంలో తిరుగుతూ మురుగునీటి కాల్వలను పరిశీలించి, పరిసరాల పరిశుభ్రతను గ్రామస్తులకు వివరించారు. టేంకంపేట గ్రామం మొత్తాన్ని కాలినడక పర్యటించారు. పల్లెప్రగతిలో చేపడుతున్న పనులు ముమ్మరంగా చేయాలని అదేశించారు. నర్సరీలో పెరుగుతున్న మొక్కలను పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి చిన్నారుల వివరాలను తెలుసుకుని, పిల్లలకు పౌష్టికాహారం అందజేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో నగరాజు, ఎంపీపీ కల్లూరి అనిత, మండల ప్రత్యేక అధికారి వెంకటరమణ, ఎంపీడీవో స్వర్ణకుమారి, సర్పంచ్‌ అంతన్నగారి సత్తమ్మయాదగిరి పాల్గొన్నారు.


logo