శుక్రవారం 29 మే 2020
Siddipet - Jan 27, 2020 , 23:06:43

పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమిపూజ

పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి భూమిపూజ
  • - ఠాణా నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు
  • - భూమి పూజలో పాల్గొన్న కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, సీపీ జోయల్‌డెవిస్‌

మర్కూక్‌: మండలంలో నూతన పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి కలెక్టర్‌ వెంకట్రామ్‌ రెడ్డి, సీపీ జోయల్‌ డెవిస్‌, ఏసీపీ నారాయణ, మర్కూక్‌ ఎస్‌ఐ శ్రీశైలం యాదవ్‌  సోమవారం భూమి పూజ చేశారు. శివారు వెంకటాపూర్‌ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలోని సర్వే నంబర్‌ 602లో 8 ఎకరాల 35 గుంటల భూమిలో పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి 14 కోట్ల నిధులు మంజూరు చేశారు. నూతన పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణంలో భాగంగా అధికారులకు, సిబ్బంది క్వార్టర్స్‌, సిబ్బంది రెస్ట్‌ రూమ్‌, మహిళా సిబ్బంది రెస్ట్‌ రూమ్‌, అధికారుల గెస్ట్‌ రూమ్‌ అత్యాధునిక సాంకేతికతతో నిర్మించడం గురించి సోమవారం కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, ఐఏఎస్‌, సీపీ జోయల్‌ డెవిస్‌, ఐపీఎస్‌, పోలీస్‌ స్టేషన్‌ నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. అంతక ముందు సీఎం ఓఎస్డీ సుధాకర్‌తేజ ఆధ్వర్యంలో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, సీపీ డెవిస్‌, స్థానిక ఎస్‌ఐ శ్రీశైలంయాదవ్‌, ఎంపీపీ పాండుగౌడ్‌, అధికారులు పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భూమిపూజ చేశారు. 


ఈ సందర్భంగా కలెక్టర్‌, ఏసీపీ మాట్లాడుతూ 100 రోజులలో అన్నిరకాల భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని గుత్తదారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నర్సింలు, ట్రెనీ ఐఏఎస్‌ ముజామిల్‌, ట్రెనీ ఐపీఎస్‌ అఖిల్‌ మహాజన్‌, గజ్వేల్‌ గడా అధికారి ముత్యం రెడ్డి, గజ్వేల్‌ ఏసీపీ నారాయణ, ఈఈ సుదర్శన్‌ రెడ్డి, డీఈఈ రాజయ్య, ఏఈ రాజశేఖర్‌ రెడ్డి, గజ్వేల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ నరసింహరావు, ఎంపీటీసీ కనకయ్య, జడ్పీటీసీ  మంగమ్మరామచంద్రం, సర్పంచ్‌లు భాస్కర్‌, ప్రసాద్‌, ఎర్రవల్లి ఎంపీటీసీ ధనలక్ష్మి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.  


logo