ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 27, 2020 , 04:41:52

గోదావరి జలాలతో సస్యశ్యామలం

గోదావరి జలాలతో సస్యశ్యామలం
  • ప్రతీ చెరువు, కుంటలను నింపేందుకు ప్రణాళికలు
  • 71వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి
  • పంచాయతీలకు ప్రతి నెల రూ.13.27 కోట్లు విడుదల
  • పల్లెలన్నీ పచ్చదనం.. పరిశుభ్రతతో వెల్లివిరియాలి

చింతమడక, మాచాపూర్‌, సీతారాంపల్లిలకు 1,800 ఇండ్ల సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ‘జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయక, కొండపోచమ్మ రిజర్వాయర్ల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.. కుడి, ఎడమ కాల్వల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి రిజర్వాయర్ల కింద ఉన్న ప్రతి చెరువు, చెక్‌డ్యాం, కుంటలను నింపాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.. త్వరలోనే జిల్లాకు గోదావరి జలాలు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతం సస్యశ్యామలం కానుంది’.. అని కలెక్టర్‌ వెంకట్రామ్‌రె డ్డి అన్నారు. రిజర్వాయర్లకు కావాల్సిన భూములను సేకరించామని, ఇందుకు సహకరించిన రైతులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడి ఐదేండ్లు పూర్తి చేసుకుందని, జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు , అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు చెప్పారు. బంగారు తెలంగాణ సాధనకు జిల్లా అభివృద్ధి కోసం మనమందరం పునరంకి తం కావాలని పిలుపునిచ్చారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు ప నులు, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలు, పల్లె ప్రగతి, గ్రా మీణ ఉపాధిహామీ పథకం, రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్‌, రైల్వేలైన్‌, హరితహారం, రహదారులు, పరిశ్రమలు తదితర పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని చెప్పారు. సిద్దిపేట(జయశంకర్‌ స్టేడియం) పరేడ్‌ మైదానంలో ఆదివారం 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన శకటాలు ఎంతో ఆకట్టుకున్నాయి. విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించా యి. పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌, జేసీ పద్మాకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, డీఆర్‌వో చంద్రశేఖర్‌తో కలిసి స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను ప్రశంస పత్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రగతిపై కలెక్టర్‌ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... 


పల్లె ప్రగతి..

సీఎం కేసీఆర్‌ భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక శ్రద్ధతో నూతన పంచాయతీ రాజ్‌ చట్టం-2018 ప్రకారం చుట్టగా, దేశంలోనే మొదటిసారిగా పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టారు. జిల్లాలోని అన్ని గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియాలని, ప్రణాళిక పద్ధతిలో నిధుల వినియోగం జరుగాలని తొలివిడుత 30 రోజుల ప్రణాళిక చేపట్టాం. గత సెప్టెంబర్‌, అక్టోబర్‌ మా సంలో రెండో విడుత 11 రోజుల పల్లె ప్రగతి కా ర్యక్రమాన్ని జనవరి మాసంలో నిర్వహించాం. ప ల్లె ప్రగతిలో భాగంగా 141 గ్రామాల్లో వైకుంఠధామాలు పూర్తి కాగా, 289 నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. స్వచ్ఛతలో భాగంగా ప్రతి గ్రా మానికి డంపింగ్‌ షెడ్‌ నిర్మాణాలు చేపట్టగా, 12 గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి. 341 గ్రామా ల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. శిథిలావస్థలో ఉన్న ఇండ్లు, పాడుబడిన బావులు, సర్కారు తుమ్మ చెట్లు, పిచ్చి మొక్కలు తొలగించాం. పవర్‌ వీక్‌లో భాగంగా వేలాడే విద్యుత్‌ తీగలు సరిచేయడంతో పాటు తుప్పు పట్టిన ఇనుప స్తంభాలను తొలగించాం. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు ప్రతి ఇంటికి రెండు చెత్త బుట్టలను పంపిణీ చేశాం. గ్రామపంచాయతీలకు ట్రాక్టర్లను కొనుగోలు చేసి పారిశుధ్యం, పచ్చదనం పనులు ప్రారంభించాం. జిల్లాలో 359 ట్రాక్లర్లను కొనుగోలు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచాం. పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం జిల్లాలోని అన్ని పంచాయతీలకు ప్రతి నెలా రూ. 13 కోట్ల 27 లక్షలను విడుదల చేస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు జిల్లాకు రూ. 73 కోట్ల 42 లక్షల నిధులను విడుదల చేసింది.


చెరువుల పునరుద్ధరణ

చెరువుల పునరుద్ధరణ ద్వారా వ్యవసాయరంగాన్ని సుసంపన్నం చేసేందుకు చేపట్టిన మిషన్‌ కాకతీయతో జిల్లా రాష్ట్రంలోనే ప్రగతి స్థానంలో ఉందని సంతోషిస్తున్నా. నాలుగు విడుతల్లో 2,140 చెరువులను రూ.536 కోట్లతో పునరుద్ధరణ చేపట్టడం జరిగింది. వీటిలో 1,976 చెరువులు పూర్తి కాగా, 164 చెరువులు వివిధ దశల్లో ఉన్నాయి.  శనిగరం ప్రాజెక్టు పునరుద్ధరణకు రూ.28 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టడం జరిగింది. జిల్లాలోని వాగులపై 38 చెక్‌డ్యాంల నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత చిన్న నీటి పారుదల చెరువులను నింపేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నాం.


వ్యవసాయం

రైతులు పంట వేయడానికి పెట్టుబడి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం ద్వారా వానకాలం 2019 సంవత్సరానికి గానూ జిల్లాలో 2,59,807 మంది రైతులుండగా ఇప్పటి వరకు 2,27,763 మంది రైతులకు 275 కోట్ల రూపాయలను అందించడం జరిగింది. ఎకరాకు రూ 5 వేల చొప్పున రెండు పంటలకు రూ.10 వేలను ఏడాదికి అందించడం జరుగుతుంది. యాసంగి పంట పెట్టుబడి సాయం కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. త్వరలోనే నేరుగా రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ కానున్నాయి. మరణించిన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ద్వారా 2019 సంవత్సరానికి గానూ ఇప్పటివరకు 269 మంది రైతులకు గానూ 226 మంది రైతులకు రూ.11 కోట్ల 30లక్షల బీమా సొమ్ము చెల్లించాం. సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలను అందించాం. గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేశాం.


మిషన్‌ భగీరథ 

ప్రతి ఇంటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన నీరు అందించి ప్రజలకు మంచినీటి కష్టాలు శాశ్వతంగా దూరం చేయడానికి ప్రభుత్వం మిషన్‌ భగీరథ ప్రారంభించింది. జిల్లాలో 771 ఆవాసాలకు రూ.1,600 కోట్ల అంచనాతో 580 ట్యాంకుల నిర్మాణం, 2,729 కి. మీ పైపులైన్‌, 2,17,266 నల్లా కనెక్షన్లు మంజూరు చేశాం. జిల్లాలోని పూర్తి ఆవాసాలకు ఇంటింటికి నల్లా కనెక్షన్లు పూర్తి చేసి ప్రతి రోజు తాగునీరు సరఫరా చేస్తాం.


పశు సంవర్ధక, మత్స్యశాఖ

 మత్స్యపరిశ్రమపై ఆధారపడిన వారికి జీవనోపాధి కల్పించేందుకు 2019-20 సంవత్సరంలో జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలో 368 లక్షల చేప పిల్లలను పెంచడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 780 చెరువుల్లో 2కోట్ల 48 లక్షల 86 వేల చేప పిల్లలను విడుదల చేశాం. 2019-20లో 4లక్షల 71 వేల స్కాంపి, రొయ్య పిల్లలను 3 చెరువుల్లో విడుదల చేశాం. సమీకృత మత్య్స అభివృద్ధికి జిల్లాలో 3,094 మందికి ద్విచక్ర వాహనాలు, 104 మందికి లగేజీ ఆటోలు, 14 మందికి సంచార చేపల అమ్మకం వాహనాలు అందజేశాం. గొర్రెల పెంపకం అభివృద్ధి ద్వారా యాదవులు ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో జిల్లాలో ఇప్పటి వరకు 412 సొసైటీ సభ్యులకు 15,232 గొర్రెల యూనిట్లను పంపిణీ చేశాం. గొర్రెల పెరుగుదల కోసం 1,165 మెట్రిక్‌ టన్నుల దాణాను 75 శాతం సబ్సిడీపై ఇచ్చాం.


రెండు పడక గదులు

పేదవాడి సొంతింటి కలను నిజం చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం పథకం కింద జిల్లాలో 12,820 ఇండ్లను మంజూరు చేశాం. ఇప్పటివరకు 10, 671 ఇండ్ల నిర్మాణం ప్రారంభించగా, 7,136 గృహ నిర్మాణాలు పూర్తి చేసుకొని మొత్తం 1,018 ఇండ్లలో లబ్ధిదారులు గృహప్రవేశం చేయించాం. ఇప్పటి వరకు రూ.464 కోట్లను ఖర్చు చేశాం. రాష్ట్రంలోనే అత్యధిక సంఖ్యలో ఇండ్ల మంజూరు నిర్మాణం పూర్తి చేసిన జిల్లాగా ప్రథమ స్థానంలో నిలవడానికి సంతోషిస్తున్నాం. సీఎం కేసీఆర్‌ చింతమడక, మాచాపూర్‌, సీతారాంపల్లి గ్రామాలకు 1800 ఇండ్లను మంజూరు చేశారు. 


అటవీశాఖ

నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్‌ వద్ద 138 హెక్టార్లలో తేజోవనం, గజ్వేల్‌ పట్టణం  సంగాపూర్‌ వద్ద 117 హెక్టార్లలో కల్పక వనాలను అభివృద్ధి చేస్తున్నాం. చింతమడక రిజర్వ్‌డ్‌ ఫారెస్టును అర్బన్‌ పార్కుగా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించగా, పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని సహజ అడవులలో 10 వేల ఎకరాల్లో అడవుల పునరుర్జీవన చర్యలను పెద్ద ఎత్తున చేపట్టాం. దాదాపు 7,500 ఎకరాల్లో మొక్కలు నాటి అడవులన్నింటినీ నాణ్యమైనవిగా మార్చి దేశంలోనే జిల్లాను ఒక ఉదాహరణగా నిలిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అటవీ అధికారులు, పర్యావరణ వేత్తలు, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, సిద్దిపేట జిల్లాను సందర్శించి అడవుల పునర్జీవ పనుల పట్ల హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లు, కేబినెట్‌ మంత్రులతో జిల్లాలో చేపట్టిన అడవుల పునర్జీవన పనులను పర్యవేక్షించి, జిల్లా అటవీశాఖ పనితీరు పట్ల సంతోషం వ్యక్తపర్చడం జిల్లాకే గర్వ కారణం.


హరితహారం

హరితహారంలో భాగంగా జిల్లాలో 2019-20లో 3 కోట్ల 85 లక్షల 76 వేల మొక్కలు నాటుట లక్ష్యం కాగా, కోటి 50 లక్షల 96 వేల మొక్కలు నాటాం. అటవీశాఖ ద్వారా 402 హెక్టార్లలో బ్లాక్‌ ప్లాంటేషన్‌, 27 కి.మీ. వెదురు ప్లాంటేషన్‌, 22 కి.మీ బండ్‌ ప్లాంటింగ్‌, 17 కి.మీ అవెన్యూ ప్లాంటేషన్‌, 181 కి.మీ గచ్చ కాయ మొక్కలు నాటే పనులు పూర్తి చేశాం. ఎక్సైజ్‌ శాఖ ద్వారా 4 లక్షల 27 వేల 855 ఈత మొక్కలను నాటాం. ప్రతీ పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేశాం. జిల్లాలోని 499 పంచాయతీల్లో వచ్చే ఏడాది కోసం 55 లక్షల మొక్కలు పెంచాం.


గ్రామీణ ఉపాధి హామీ పథకం

ఉపాధి హామీలో భాగంగా జిల్లాలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ 1,87,525 జాబ్‌ కార్డుల ద్వారా 97,648 కుటుంబాలకు 47,25,293 పని దినాలు కల్పించి రూ.89 కోట్ల 60 లక్షలు చెల్లించాం. 9,102 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించి, జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.


శాంతి భద్రతలు

 జిల్లా పోలీసు యంత్రాంగం అత్యున్నత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ జిల్లా పరిరక్షణకు నేరాలను నియంత్రించడంలో ఆహర్నిశలు కృషి చేస్తున్నది. శాంతి భద్రతల విషయంలో జిల్లాలో ఇప్పటి వరకు 458 గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మహిళల భద్రత గురించి గ్రామాల్లో పట్టణాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాం. జిల్లాలో నిరుద్యోగ యువతకు పోలీసు శిక్షణ అందించడం ద్వారా 6మంది ఎస్‌ఐలు, 158 మంది కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు.


గజ్వేల్‌ అభివృద్ధికి ‘గడా’ 

గజ్వేల్‌ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా గజ్వేల్‌ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(గడా)ను ప్రభుత్వం 2014లో ఏర్పాటు చేసి, ప్రత్యేకాధికారిని నియమించింది. ఆరేండ్ల నుంచి గడా పలు అభివృద్ధి పనులు చేపట్టి, నియోజకవర్గ ప్రజల మౌలిక, భౌగోళిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వం 293 కోట్ల 42 లక్షల నిధులు విడుదల చేయగా, ఇప్పటి వరకు 2,942 వివిధ అభివృద్ధి పనులను నియోజకవర్గంలో చేపట్టి 2,064 పనులు పూర్తి చేశారు.


సిద్దిపేట పురపాలక

సిద్దిపేట పట్టణంలో అమృత్‌ పథకం ద్వారా రూ. 278 కోట్లతో 2 ఎస్టీపీ ప్లాంట్లు, 325 కి.మీ మురుగు నీటి పైపులైన్లకు గాను 255 కి.మీ పనులు పూర్తి చేశాం. సిద్దిపేట పట్టణంలో బైపాస్‌ రోడ్‌లో విపంచి కళా నిలయం రూ.7 కోట్లతో పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చాం. కోమటి చెరువు వద్ద సైక్లింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.1.50 కోట్లతో పట్టణంలోని వివిధ వార్డుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం.


ప్రత్యేక కృతజ్ఞతలు

ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్లి రాష్ట్రంలో మన జిల్లాను వివిధ రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పార్లమెంట్‌ సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్న వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీలు, ఫ్రింట్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలకు ధన్యవాదాలు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లా న్యాయ అధికారి, శాంతిభద్రతలు పరిరక్షించడంలో అహర్నిషలు విధులు నిర్వహిస్తున్న పోలీసు కమిషనర్‌, పోలీసు యంత్రాంగానికి అభినందనలు తెలుపుతున్నా. స్వాతంత్య్ర సమరయోధులకు కలెక్టర్‌ ప్రత్యేక అభినందనలు.


logo