సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 27, 2020 , 04:23:51

టీటీసీ పరీక్షలకు పటిష్ట బందోబస్తు

టీటీసీ పరీక్షలకు పటిష్ట బందోబస్తు

సిద్దిపేట టౌన్‌ : సిద్దిపేటలో టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు (టీటీసీ) పరీక్షలు నేటి నుంచి 30 వరకు జ రగనున్నాయి. అందుకు గాను జిల్లా కేంద్రం సిద్దిపేటలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేం ద్రాల వద్ద పటిష్ట బందోబస్తు చేపడుతున్నట్లు సిద్దిపేట పోలీసు కమిషనర్‌ జోయల్‌ డెవిస్‌ ఆదివా రం వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ టీటీసీ పరీక్షలకు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల - సిద్దిపేట, ప్రభుత్వ న్యూ హైస్కూల్‌ - సిద్దిపేట, ప్రభుత్వ హైస్కూల్‌ - సిద్దిపేటలో కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నుంచి 500 మీటర్ల వరకు ప్రజలు గూమికూడవద్దని తెలిపారు. పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టామన్నారు.  విద్యార్థులందరు పరీక్ష సమయానికి కంటే గంట ముందుగానే కేంద్రాలకు చే రుకోవాలన్నారు. 

డాగ్‌ స్కాడ్‌ కేంద్రాన్ని ప్రారంభించిన సీపీ 

సిద్దిపేట ఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో నూతనంగా ఆధునీకరించిన డాగ్‌ స్కాడ్‌ కేంద్రాన్ని ట్రైనీ ఐపీఎస్‌ అఖిల్‌ మహజన్‌తో కలిసి సీపీ జోయల్‌ డెవిస్‌ ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఏఆర్‌ ఎస్‌పీలు బాబురావు, రియాల్‌ ఉల్‌హక్‌, ఆర్‌ఎస్‌ఐలు రామకృష్ణ, డేవిడ్‌ విజయ్‌కుమార్‌, గణేశ్‌, డాగ్‌ స్వాడ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

తాజావార్తలు


logo