సోమవారం 28 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 27, 2020 , 04:20:55

మువ్వన్నెల రెపరెపలు

 మువ్వన్నెల రెపరెపలు

హుస్నాబాద్‌ నియోజకర్గంలో 71వ గణతంత్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. హుస్నాబాద్‌ పట్టణంతో పాటు అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో జెండావిష్కరణ కార్యక్రమం ఆనందోత్సాహాల మధ్య జరిగింది. విద్యార్థుల ర్యాలీలు, వేషధారణలు అలరించాయి. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, నెహ్రూచౌక్‌, గాంధీచౌక్‌, మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ రాజమల్లయ్య, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ మహేందర్‌, పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీనివాస్‌, మున్సిఫ్‌కోర్టులో జడ్జి వెంకటమాలి సుబ్రమణ్యశర్మ, సింగిల్‌ విండోలో చైర్మన్‌ శివయ్య, మార్కెట్‌ కార్యాలయంలో కార్యదర్శి బి వెంకటయ్య, ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ రాంచంద్రారెడ్డి, ప్రభుత్వ బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎంలు బండారి మనీల, ఎస్‌ వెంకటయ్య జెండావిష్కరణ చేశారు. 

- హుస్నాబాద్‌ బృందం 


logo