ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 27, 2020 , 04:15:52

అంతకపేట, గొల్లకుంట గ్రామాలకు ‘పల్లె ప్రగతి’అవార్డులు

 అంతకపేట, గొల్లకుంట గ్రామాలకు ‘పల్లె ప్రగతి’అవార్డులు

అక్కన్నపేట: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండో విడుత పల్లె ప్రగతిలో మండలంలోని అంతకపేట, గొల్లకుంట గ్రామాలు ముందంజలో నిలిచాయి. దీంతో ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో భాగంగా ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఇర్రి లావణ్యరెడ్డి, కాశబోయిన యాదగిరి, పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్వర్‌రావు, సరస్వతికి కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ప్రశంసా పత్రాన్ని అందజేసి అభినందించారు. అంతకపేట, గొల్లకుంట గ్రామాలకు పల్లె ప్రగతి అవార్డులు రావడంపై ఆయా గ్రామస్తులు, మండల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 


కోహెడకు మూడు ఉత్తమ అవార్డులు

కోహెడ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండలంలోని వెంకటేశ్వర్లపల్లి, చెంచెల్‌చెర్వుపల్లి గ్రామాల్లో పనులు విజయవంతంగా జరగడంతో జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతులకు ఎంపికయ్యాయి. ఆదివారం సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన రిపబ్లిక్‌ డే వేడుకల్లో  కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, జడ్పీ చైర్‌ పర్సన్‌ ఏలేటి రోజాశర్మ  చేతుల మీదుగా గ్రామాల సర్పంచ్‌లు భీంరెడ్డి సత్యవతి, తోట భాగ్యలక్ష్మి అవార్డులను అందుకున్నారు. కార్యక్రమాల్లో కార్యదర్శులు ప్రత్యూష, నరేశ్‌ను అభినందించారు. 


సామాజిక సేవా అవార్డు అందుకున్న సుభాష్‌

మండలంలోని కూరెల్ల గ్రామ కేంద్రంగా స్వచ్ఛంద సేవలు అందిస్తున్న సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు వలుస సుభాష్‌ ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఉత్తమ సామాజిక సేవా అవార్డును అందుకొని జిల్లా కలెక్టర్‌ వెంకట్రామరెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. 


ఉత్తమ సేవలకు పురస్కారం

హుస్నాబాద్‌రూరల్‌ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మండలంలో ఆదర్శవంతంగా చేపట్టినందుకు గానూ హుస్నాబాద్‌ ఎంపీడీవో దమ్మని రాము ఉత్తమ ఎంపీడీవో పురస్కారాన్ని అందుకున్నారు. ఈ మేరకు ఆదివారం సిద్దిపేటలో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఎంపీడీవోగా ఆయన ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. 


logo