శనివారం 26 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 24, 2020 , 23:28:31

జనజాతర

జనజాతర
  • - సింగరాయ, కూడవెల్లి జాతర్లకు పోటెత్తిన భక్తులు
  • - అభయారణ్యంలో జనసందోహం
  • - దాదాపు లక్షన్నరపైనే వచ్చినట్లు అంచనా
  • - ఘనంగా మాఘ అమావాస్య పుణ్యస్నానాలు
  • - లక్ష్మీనారసింహుడు, రామలింగేశ్వరుడికి పూజలు


కోహెడ: సల్లంగా సూడు లక్ష్మీనర్సింహా అంటూ శుక్రవారం మండలంలోని కూరెల్ల గ్రామ సమీపంలోని ప్రతాపరుద్ర సింగరాయ లొద్దిలో జరిగిన జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. సు మారు లక్షకుపైగా భక్తులు స్వామివారి జాతరకు వచ్చి కొండపై గుహలో వెలిసిన  ప్రతాపరుద్ర లక్ష్మీనర్సింహస్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ సర్పంచ్‌ గాజుల రమేశ్‌  పట్టువస్ర్తాలు సమర్పించగా ఆలయ పూజారి శ్రీరంగం నర్సింహాచార్యులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఉదయం 5గంటల నుంచే కూరెల్ల, తంగల్లపల్లి, గుం డారెడ్డిపల్లి, బస్వాపూర్‌, కోహెడ తదితర గ్రామాల భక్తులు తరలివచ్చి తూర్పు నుంచి పడమరకు ప్రవహించే మోయతుమ్మెద వాగులో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కరీంగనర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, భీమండి, బొంబయి తదితర పట్టాణాల నుంచి  భక్తులు వచ్చి స్వామి వారికి మొక్కులు సమర్పించుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, ఎంపీపీ కొక్కుల కీర్తి, తహసీల్దార్‌ బి. రుక్మిణి జాతర పర్యవేక్షించారు. సుమారు 100 మంది సిబ్బందితో ఏసీపీ మహేందర్‌ పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడిషనల్‌ సెక్రటరీ వేముల పరమేశ్వర్‌రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.logo