శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Jan 24, 2020 , 04:51:38

గాల్లో ఎగురుదాం..

గాల్లో ఎగురుదాం..
  • - సిద్దిపేటలో బెలూన్‌ ఫెస్టివల్‌
  • - రేపు, ఎల్లుండి కోమటి చెరువు వద్ద ఉత్సవాలు
  • - గాలిలో ఎగురుతూ చెరువు అందాలు వీక్షించే చాన్స్‌
  • -మంత్రి హరీశ్‌రావు చొరవతో పర్యాటక శాఖ ఏర్పాట్లు


కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ : కోమటి చెరువు అందాలను వీక్షించడానికి  ఎయిర్‌ బెలూన్‌లో గాల్లో విహరించే మరో వినూత్న కార్యక్రమానికి మంత్రి  హరీశ్‌రావు చొరవతో టూరిజం శాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగం గా ఈ నెల 25, 26 తేదీల్లో రెండు రోజులపాటు ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్‌ కు కోమటి చెరువు వేదిక కానుంది. మహానగరాలతోనే జరిగే ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్స్‌ సిద్దిపేటలో కూడా జరగనున్నాయి. పర్యాటకులు సిద్దిపేట అభివృద్ధి.. కోమటి చెరువు అందాలను హాయిగా గాల్లో ఎగురుతూ వీక్షించే అద్భుతమైన అవకాశం పట్టణ వాసులకు దక్కింది. ఇప్పటికే పర్యాటకులతో నిత్యం కిటకిటలాడుతున్న కోమటి చెరువు వద్ద ఎయిర్‌ బెలూన్‌ ఫెస్టివల్స్‌ ఉత్సవాలకు సందర్శకుల తాకిడి పెరుగనుంది. పర్యాటకులను ఆకర్శించడంతోపాటు సిద్దిపేట అభివృద్ధిని ఎయిర్‌ బెలూన్‌ ద్వారా గాల్లో విహరిస్తూ చూసేటువంటి అద్భుత అవకాశం పర్యాటకులకు దక్కనుంది. ఇప్పటికే సస్పెన్షన్‌ బ్రిడ్జి, బోటింగ్‌, అడ్వంచర్‌ పార్కు నిర్మాణాలతో పర్యాటకులు నిత్యం వచ్చి ఇక్కడి ఆహ్లాకరమైన వాతావరణం ఆస్వాదిస్తున్నారు.logo